Adulterated Liquor Case: ఆంధ్రప్రదేశ్‌లో ఓవైపు లిక్కర్ స్కామ్ కేసు.. మరోవైపు.. నకిలీ లిక్కర్ కేసులు కాక రేపుతున్నాయి.. అయితే, అన్నమయ్య జిల్లా మొలకలచెరువు నకిలీ మద్యం వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.. ఈ కేసులో 10 మంది నిందితులను మూడురోజుల కస్టడీ కి అనుమతి ఇచ్చింది తంబళ్లపల్లె కోర్టు.. అయితే, నకిలీ లిక్కర్ స్కామ్ కేసులో 10 మంది నిందితులను ఏడు రోజులు కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది ఎక్సైజ్ శాఖ.. దీనిపై విచారణ జరిపిన తంబళ్లపల్లె కోర్టు.. 10 మంది నిందితులను మూడు రోజుల కస్టడీ అనుమతి ఇచ్చింది.. దీంతో, రేపు ఉదయం నిందితులను కస్టడీలోకి తీసుకోనున్నారు ఎక్సైజ్ శాఖ అధికారులు.. మరోవైపు, ఇంత వరకు A5 జయచంద్రారెడ్డి పీఏ రాజేష్, A.17 జయ చంద్రారెడ్డి, A.18 గిరిధర్ రెడ్డి ఆచూకీ లభించలేదు..
Read Also: Diwali 2025 Offers: దీపావళి బిగ్ ఆఫర్.. ఒకే ధరకు ఐఫోన్ 15, ఐఫోన్ 13!
ఇక, ములకలచెరువు నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న జనార్థన్ రావు అరెస్టు చూపేందుకు అనుమతి ఇవ్వాలని తంబళ్లపల్లెలో పీటీ వారెంట్ దాఖలు చేశారు ఎక్సైజ్ పోలీసులు.. దీనిపై విచారణను రేపటికి వాయిదా వేసింది కోర్టు.. మరోవైపు.. నకిలీ మద్యం కేసులో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు ఎక్సైజ్ శాఖ అధికారులు… రమేష్, అల్లా భక్షు, శ్రీకర్ అనే ముగ్గురిని విజయవాడలో విచారిస్తున్నారు ఎక్సైజ్ శాఖ పోలీసులు.. నకిలీ మద్యం తయారీకి ముగ్గురు సహకరించినట్టు ఎక్సైజ్ శాఖ అధికారులు గుర్తించారు.. ముగ్గురిని రేపు అరెస్ట్ చూపించే అవకాశం ఉంది..
