Fake Liquor Case: అన్నమయ్య జిల్లా మొలకలచెరువులో వెలుగుచూసిన నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఇప్పటివరకు 33 మంది నిందితులు ఉన్నట్లు పోలీసులు నమోదు చేయగా, వారిలో ఏడుగురు నిందితులకు తంబళ్లపల్లి కోర్టు ఈ రోజు బెయిల్ మంజూరు చేసింది.. అయితే, ఏడుగురు నిందితులకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది కోర్టు..
కోర్టు బెయిల్ మంజూరు చేసిన నిందితులు..
A6 – మణి మారన్
A7 – ఆనందన్ శ్రీనివాసన్
A9 – వేంకటేశన్ సురేష్
A12 – కొడాలి శ్రీనివాస రావు
A14 – నాగరాజు
A20 – సుదర్శన్
A21 – అష్రఫ్ కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది న్యాయస్థానం..
అయితే, దర్యాప్తుకు పూర్తిగా సహకరించాలి.. అవసరమైనప్పుడు విచారణకు హాజరుకావాలి.. ఎలాంటి సాక్ష్యాలను ప్రభావితం చేయరాదు.. కేసుకు సంబంధించిన కార్యకలాపాల్లో మళ్లీ పాల్గొనరాదు లాంటి పలు షరతులు విధించింది కోర్టు.. కాగా, మొలకలచెరువులో పెద్దఎత్తున నకిలీ మద్యం తయారీ, సరఫరా జరుగుతోందన్న సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించగా, భారీగా మద్యం స్టాక్, తయారీ సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో పలు రాష్ట్రాలు, ప్రాంతాలకు లింకులు ఉన్నాయన్న కోణంలో సిట్ తరహా లోతైన దర్యాప్తు కొనసాగుతోంది. ఇక, బెయిల్ మంజూరు అయినప్పటికీ, దర్యాప్తు కొనసాగుతూనే ఉంటుందని, ఈ కేసులో ఇతర నిందితుల పాత్ర, సరఫరా నెట్‌వర్క్, ఆర్థిక లావాదేవీలపై మరింత లోతుగా విచారణ జరుగుతుందని పోలీసులు తెలిపారు.
