Fake Liquor Case: మొలకలచెరువు నకిలీ మద్యం కేసు.. ఏడుగురు నిందితులకు బెయిల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fake Liquor Case: అన్నమయ్య జిల్లా మొలకలచెరువులో వెలుగుచూసిన నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఇప్పటివరకు 33 మంది నిందితులు ఉన్నట్లు పోలీసులు నమోదు చేయగా, వారిలో ఏడుగురు నిందితులకు తంబళ్లపల్లి కోర్టు ఈ రోజు బెయిల్ మంజూరు చేసింది.. అయితే, ఏడుగురు నిందితులకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది కోర్టు..
కోర్టు బెయిల్ మంజూరు చేసిన నిందితులు..
A6 – మణి మారన్
A7 – ఆనందన్ శ్రీనివాసన్
A9 – వేంకటేశన్ సురేష్
A12 – కొడాలి శ్రీనివాస రావు
A14 – నాగరాజు
A20 – సుదర్శన్
A21 – అష్రఫ్ కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది న్యాయస్థానం..
Also Read
- RTC Bus Stolen: కదిరిలో విచిత్ర దొంగ.. పెంపుడు కుక్కను ఎక్కించుకుని ఆర్టీసీ బస్సుతో పరారీ.. ట్విస్ట్ ఏంటంటే..?
- SBI ATM Theft: అర్ధరాత్రి దొంగల ముఠా బీభత్సం.. ఏకంగా ఏటీఎం మిషన్నే ఎత్తుకెళ్లారుగా.!
- MP Mithun Reddy: అమరావతికి కాదు.. అవినీతికే మేం వ్యతిరేకం..
- Madanapalli Girl Murder: మదనపల్లి చిన్నారి హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. సూసైడ్ చేసుకున్న నిందితుడు!
అయితే, దర్యాప్తుకు పూర్తిగా సహకరించాలి.. అవసరమైనప్పుడు విచారణకు హాజరుకావాలి.. ఎలాంటి సాక్ష్యాలను ప్రభావితం చేయరాదు.. కేసుకు సంబంధించిన కార్యకలాపాల్లో మళ్లీ పాల్గొనరాదు లాంటి పలు షరతులు విధించింది కోర్టు.. కాగా, మొలకలచెరువులో పెద్దఎత్తున నకిలీ మద్యం తయారీ, సరఫరా జరుగుతోందన్న సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించగా, భారీగా మద్యం స్టాక్, తయారీ సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో పలు రాష్ట్రాలు, ప్రాంతాలకు లింకులు ఉన్నాయన్న కోణంలో సిట్ తరహా లోతైన దర్యాప్తు కొనసాగుతోంది. ఇక, బెయిల్ మంజూరు అయినప్పటికీ, దర్యాప్తు కొనసాగుతూనే ఉంటుందని, ఈ కేసులో ఇతర నిందితుల పాత్ర, సరఫరా నెట్వర్క్, ఆర్థిక లావాదేవీలపై మరింత లోతుగా విచారణ జరుగుతుందని పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
1984 Anti-Sikh Riots: “సజ్జన్ కుమార్ హీరోనా.?” రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని సిక్కుల ఆందోళన..
-
Duleep Trophy 2026: వైభవ్ సూర్యవంశీ చెలరేగుతాడా?.. షమీ, పృథ్వీ, సర్ఫరాజ్లకు కీలక పరీక్ష..
-
Tollywood: టాలీవుడ్ కు లాభాలే లాభాలు
-
New Rules: విమాన ప్రయాణికులకు అలర్ట్.. సెప్టెంబర్ 1 నుంచి కొత్త రూల్స్ ఇవే!
-
Chiranjeevi – Odela Movie Update: మెగాస్టార్ బర్త్డే స్పెషల్.. చిరు – ఓదెల మూవీపై బిగ్ క్లారిటీ! ఆ సినిమా ఆగిపోలేదట..
ట్రెండింగ్
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!