Site icon NTV Telugu

Anil Kumar Yadav: నేనేమైనా అంటరానివాడినా? నేనెక్కడికి వెళ్లకూడదా?

ఏపీలో కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణ సందర్భంగా నెల్లూరు జిల్లా వైసీపీ నేతల్లో విభేదాలు బయటపడుతున్నాయి. మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అభినందన సభలో మాజీ మంత్రి అనిల్‌ కుమార్ యాదవ్‌పై వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి ఆరోపణలు చేశారు. మూడేళ్లుగా జిల్లాలో ఇరిగేష‌న్‌కు సంబంధించి ఆశించిన మేర అభివృద్ధి జ‌ర‌గ‌లేదంటూ వ్యాఖ్యానించారు. దీంతో ఆనం వ్యాఖ్యలకు తాజాగా అనిల్ కుమార్ యాదవ్ కౌంటర్ ఇచ్చారు. నెల్లూరు జిల్లాలో రూ.3 వేల కోట్లతో నీటిపారుదల పనులు జరుగుతున్నాయని వివరించారు.

తనపై విమర్శలు చేసిన వ్యక్తి నియోజకవర్గంలోనే రూ.1000 కోట్ల పనులు జరుగుతున్నాయని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు. సంగం బ్యారేజీ పనులు దాదాపుగా పూర్తయ్యాయని తెలిపారు. వచ్చే నెలలో సంగం బ్యారేజీని ప్రారంభిస్తామని పేర్కొన్నారు. అయినా వయసు అయిపోయిన వారు చేసే వ్యాఖ్యలను తాను పట్టించుకోనని కౌంటర్ ఇచ్చారు. ఆయన లాగా తాను పార్టీలు మారలేదన్నారు.

తన నియోజకవర్గంలో అనధికారికంగా ఫ్లెక్సీలు వేయవద్దని ముందే చెప్పానని.. అందువల్లే కార్పొరేషన్ సిబ్బంది తొలగిస్తున్నారని క్లారిటీ ఇచ్చారు. తన ఫ్లెక్సీలు కూడా వేసుకోవడంలేదని గుర్తుచేశారు. తన బంధువుల సంవత్సరీకానికి సర్వేపల్లి వెళ్తే.. దానిని కూడా రాజకీయం చేస్తున్నారని అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. తానేమైనా అంటారానివాడినా.. ఎక్కడికీ పోకూడడా.. ఇదేం న్యాయం అని ఆవేదన వ్యక్తం చేశారు.

YCP MLA Golla Babu Rao: నా వ్యాఖ్యలపై నెగిటివ్‌గా ప్రచారం చేస్తున్నారు

Exit mobile version