Anikumar Yadav: మీలా దిగజారుడు రాజకీయం మాది కాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీ రాజకీయం హాట్ హాట్ గా సాగుతోంది. వైసీపీ నేతలు, మంత్రులు టీడీపీపై విరుచుకుపడుతున్నారు. తాజాగా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ హాట్ కామెంట్స్ చేశారు. ప్రతిపక్షాలు అబద్ధపు ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. తెలుగుదేశం పై నేను కూడా అలాంటి తప్పుడు ఆరోపణలు చేయిస్తా, రాయించ గలుగుతా అన్నారు. కానీ ..అంత నీచంగా దిగజారి రాజకీయం చేయడం మాకు చేతకాదన్నారు.
నాపేరు, కొడాలి నాని పేరు లేకపోతే కొన్ని ఛానల్స్ కు న్యూస్ ఉండదు. 2024లో ఎవరు గెలుస్తారో చూసుకుందాం..చిల్లర రాజకీయాలు మానండి అంటూ హితవు పలికారు. అమావాస్యకు ఒకసారి తిరిగే వాళ్ళు కూడా మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. చెత్త పన్నును చంద్రబాబే ప్రతిపాదించారు. దాన్ని ఇంకా తగ్గించే యోచన చేస్తున్నాం అన్నారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వైసీపీ నేతలు ప్రతి ఇంటికి తిరుగుతున్న సంగతి తెలిసిందే. పదే పదే దుష్పచారాలు చేస్తే చూస్తూ ఊరుకోమని, తనపై ఏమి రాసుకుంటారో మీడియాలో ఏం చూపించుకుంటారో చూపించుకోండి అంటూ సవాల్ విసిరారు. తాము ఏమిరాసినా ఏమి చూసిన చెల్లుబాటవుతుందనుకుంటే కడుపు మండిన అభిమానులు ఏదో ఒకరోజు తగిన బుద్ధి చెబుతారని అనిల్ హెచ్చరించారు. గత రెండురోజులుగా మాజీ మంత్రి అనిల్ తనపై వస్తున్న ప్రచారం, విపక్షాల తీరుపై మండిపడుతూనే వున్నారు.
Also Read
- Dhavaleswaram Barrage: ధవళేశ్వరం బ్యారేజీకి కొత్తరూపు.. 46 ఏళ్ల తర్వాత ఆధునికీకరణ పనులకు శ్రీకారం!
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- APL: విద్యార్థులకు శుభవార్త.. ఏపీఎల్ మ్యాచ్‌లకు ఉచిత ప్రవేశం..
- Traffic Jam : శ్రీశైలం వద్ద ట్రాఫిక్ నరకం.. 5 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు!
తాజావార్తలు
-
IND vs AFG: డెబ్యూలోనే మానవ్ సుతార్ సంచలనం.. భారీ ఆధిక్యంలో టీమిండియా..!
-
Best Investment Options: రూపాయి బలహీనత వేళ ఏ అసెట్‌లో పెట్టుబడి పెట్టాలి? గోల్డ్, ఎఫ్ డీలు లేదా రియల్ ఎస్టేట్..?
-
Tollywood : క్యాబ్ డ్రైవర్ని చితకబాదిన ఛత్రపతి సినిమా విలన్
-
Kavitha: విద్యాశాఖపై సీఎం పట్టు కోల్పోయారు.. కవిత సంచలన వ్యాఖ్యలు.!
-
Suryakumar Yadav-MI: ముంబై ఇండియన్స్‌కు సూర్యకుమార్ యాదవ్ గుడ్‌బై?.. ఇదే ప్రూఫ్!
ట్రెండింగ్
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.