NTV Telugu Site icon

Andrapradesh : మళ్లీ భారీగా పెరిగిన టమోటా ధరలు..ఆందోళనలో జనం..

Tamota

Tamota

టమోటా కూరలను ఇంట్లో చేసుకొని చాలా రోజులు అయ్యింది… ధరలను వింటే గుండె గుబెల్ మంటుంది.. ఎప్పటికప్పుడు ధరలు తగ్గుతాయి అనుకోవడం తప్ప, నిజంగా ధరలు ఇప్పట్లో తగ్గేలా కనిపించలేదు.. తెలుగు రాష్ట్రాల్లో టమోటాలు కాస్తున్న ధరలు రూ.200 పలుకుతున్నాయి.. ఏపీలో ధరలు కాస్త ఎక్కువగానే పలుకుతున్నాయి.. ఏపీ మదనపల్లె మార్కెట్‌లో టమోటా ధరలు రికార్డు సృష్టిస్తున్నాయి. ఇవాళ మదనపల్లె మార్కెట్‌లో కిలో నాణ్యమైన టమోటా ఏకంగా రూ. 168 పలికింది.. ఇదే హైయేస్ట్ ధర అని వ్యాపారులు చెబుతున్నారు..

ఏపీలోని అతిపెద్ద టమోటా మార్కెట్‌గా ఉన్న మదనపల్లె మార్కెట్‌లో టమోటా ధరలు అంతకంతకూ పెరుగుతూ జనాలను బెంబేలెత్తిస్తున్నాయి. నిన్న రూ. 140 పలికిన కేజీ టమోటా.. ఇవాళ ఏకంగా రికార్డు స్థాయిలో రూ.168కి చేరింది. ఈ మార్కెట్‌లో మొదటి రకం టమోటా ధర కిలో రూ. 140-168, రెండో రకం రూ. 118-138 వరకు ఉంది. అలాగే మూడో రకం టమోటా కిలో ధర రూ 118 నుంచి 130 వరకు పలుకుతోంది.. జనాలు కొనకున్న ధరలు రికార్డ్ స్థాయి లో నమోదు అవుతుండటం విశేషం..

మార్కెట్‌కు 361 మెట్రిక్ టన్నుల టమోటాను రైతులు మార్కెట్‌కు తీసుకురావడంతో.. మొదటి రకం టమోటాకు భారీగా డిమాండ్ పెరిగింది. కాగా, నిన్నటివరకు రూ.140 పలికిన నాణ్యమైన టమోటా.. ఇప్పుడు రూ.168కి చేరుకోవడంతో రైతుల్లో ఆనందం వ్యక్తం అయింది. ఒక్కరోజులనే కేజీకి రూ. 28 వరకు పెరిగింది. అలాగే మార్కెట్‌కు వచ్చే పంట కూడా తగ్గింది. వర్షాల కారణంగా దిగుబడి తగ్గిందని చెబుతున్నారు. ఈ ధరలు ఇంకా పెరుగుతాయనే భయం మొదలైంది. అదే జరిగితే పరిస్థితి ఏంటని సామాన్యుడు భయపడతున్నాడు. టమాటా ధరలు ఆకాశాన్ని తాకాయి. నెల రోజులుగా సామాన్యుడిని బెంబేలెత్తిస్తున్నాయి. ఈ ధరలు కాస్త తగ్గుతాయని అంచనా వేస్తే.. మళ్లీ మార్కెట్‌లో రేట్లు పెరుగుతున్నాయి.. ఇక తగ్గే సూచనలు కనిపించలేదని వ్యాపారులు చెబుతున్నారు..