NTV Telugu Site icon

Andrapradesh : రేషన్ కార్డులు ఉన్నవారికి ప్రభుత్వం గుడ్ న్యూస్..!

Ration Cardss

Ration Cardss

ఆంధ్రప్రదేశ్ లో రేషన్ కార్డులు కలిగినవారికి ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. వచ్చే నెల నుంచి రాగులను పంపిణి చేస్తున్నట్లు తెలిపారు.. రాయలసీమలోని కర్నూలు, శ్రీసత్యసాయి, అనంతపురం జిల్లాల్లో రేషన్‌కార్డులపై ఉచిత బియ్యం, సబ్సిడీ కందిపప్పు, చక్కరతో పాటు వచ్చే నెల నుంచి రాగులను కూడా పంపిణీ చేయనున్నట్లు పౌరసరఫరాలశాఖ కమిషనర్‌ హెచ్‌.అరుణ్‌కుమార్‌ తెలిపారు. ఉచిత బియ్యానికి బదులు ఒక్కొక్క కార్డుపై గరిష్ఠంగా 3 కేజీల వరకు రాగులను ఉచితంగానే అందజేస్తామని సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించారు..

అయితే, రాగులు వద్దనుకునే కార్డుదారులు యథావిధిగా మొత్తం బియ్యం తీసుకోవచ్చని వివరించారు. రాయలసీమలోని ఇతర జిల్లాల్లో జూలై నుంచి రాగుల పంపిణీ ప్రారంభిస్తామని, దశలవారీగా రాష్ట్రంలోని ఇతర జిల్లాలకూ కూడా పంపిణీ చేస్తామని అధికారులు తెలిపారు..2023ను మిల్లెట్‌ సంవత్సరంగా ప్రకటించిన నేపథ్యంలో అధిక పోషక విలువలు కలిగిన బలవర్థకమైన చిరుధాన్యాలను పేదలకు అందించాలనే ఉద్దేశంతో రాగులు, జొన్నలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు..

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇప్పటికే జొన్నలను పంపిణీ చేస్తున్నారు.. వచ్చే నెల నుంచి రాగులను కూడా పంపిణీ చేయనున్నారు.. ఇక సీఎం జగన్ మోహన్ రెడ్డి గుంటూరు పర్యటన ఫిక్స్ అయ్యింది. జూన్ 2న గుంటూరులో పర్యటించనున్నారు…ఈ సందర్బంగా వైయస్సార్ యంత్ర సేవా పథకం రెండో మెగామేళా నిర్వహణలో పాల్గొననున్నారు. ఈ మేరకు 793 ట్రాక్టర్లు, 38 హార్వెస్టర్లను రైతులకు అందించనున్నారని సమాచారం..