కల్తీకి కాదేది అనర్హం.. ఈరోజుల్లో కాసుల కక్కుర్తి కోసం మనుషుల ప్రాణాలను పణంగా పెడుతున్నారు.. ఆకలితో వస్తున్న జనాలకు కొన్ని హోటల్స్ విషాన్ని ఇస్తున్నాయని ఈ మధ్య జరుగుతున్న ఘటనలను చూస్తే ఎవ్వరికైనా అర్థమవుతుంది.. ఫుడ్ సేఫ్టీ అధికారులు చేస్తున్న ఆకస్మిక తనీఖీల్లో ఎన్నో రెస్టారెంట్ల బాగోతం బయటపడింది.. దీంతో జనాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. అయిన కల్తీ గాళ్ళు మారడం లేదు… అదే పనిలో ఉన్నారు.. తాజాగా విశాఖ లో కొన్ని హోటల్స్ పై రైడ్ చేసిన అధికారులు నమ్మలేని విషయాలను బయపెడుతున్నారు..
స్థానికంగా ఉండే కొన్ని రెస్టారెంట్లలో ఆహార పదార్థాల తయారీలో నాణ్యత పాటించడం లేదని ఫిర్యాదులు వచ్చాయి. అలాగే రోజుల తరబడి నిల్వ ఉంచిన వాటిని విక్రయిస్తున్నారని సమాచారం వచ్చింది. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేశారు. డాబా గార్డెన్స్ దగ్గర ఉన్న ఓ మెస్‌లో చికెన్, ఫిష్ కర్రీతోపాటు వెజ్ కర్రీలు కూడా రెండు, మూడు రోజుల కిందట వండి ఫ్రీజర్లు, ఫ్రిజ్‌లో నిల్వ ఉంచినట్లు గుర్తించారు అధికారులు..ఈ పదార్థాలు రంగు, రుచి కోసం కూరల్లో కొన్నిరకాల పౌడర్లను కలుపుతున్నట్లు గుర్తించారు. ఇలా పాడైపోయిన పదార్థాలను విక్రయిస్తున్నందుకు హోటల్‌కు రూ.పది వేలు జరిమానా విధించారు. ఇలా ఆర్డర్లు చేసే వారికి ముందుగా కవర్ లో ఉంచిన ఫుడ్ ను అందిస్తున్నారని అధికారులు తెల్చేశారు..
ఆ విధంగా మొత్తం మీద ఈ రెస్టారెంట్లు, హోటల్స్‌లోని ఫ్రీజర్లలో కుళ్లిపోయిన కోడి మాంసం, గుడ్లు, ముందు రోజు వండిన అన్నం.. రెండు, మూడు రోజుల కిందట వండిన చికెన్, ఫిష్, మటన్ కర్రీలు, రోజుల తరబడి నిల్వ ఉంచిన చికెన్ ఫ్రై, కస్టమర్లు అడగ్గానే వాటిని బయటకు తీసి వేడి చేసి రంగు కలిపి అందిస్తున్నట్లు తేలింది. ఇలాంటి ఆహారం తింటే ఆస్పత్రిపాలు కావడం ఖాయం.. కొందరికి పడకుంటే ఫుడ్ పాయిజన్ అవ్వడంతో డైరెక్ట్ స్మశానానికి వెళ్తున్న ఘటనలు కూడా వెలుగుచుస్తున్నాయని సమాచారం.. సో బీ కేర్ ఫుల్ మిత్రమా..