Site icon NTV Telugu

మండిన ‘రోహిణి’.. ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి

ఓ వైపు నైరుతీ రుతుపవనాలు జూన్‌ 3న కేరళలోకి ప్రవేశిస్తాయనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో మరోవైపు ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రోహిణి కార్తె ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజులుగా ఎండ తీవ్రత కొనసాగింది. వివిధ జిల్లాల్లో సాధారణం కంటే 2 డిగ్రీల అధికంగా 35.3 నుంచి 43.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గాలి తక్కువగా వీయడంతో ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. కాగా సముద్రం వైపు నుంచి దక్షిణ గాలులు రాష్ట్రం మీదుగా వస్తున్నాయి. వీటి ప్రభావంతో రానున్న రెండు రోజుల్లో రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

Exit mobile version