Site icon NTV Telugu

ఆంధ్రప్రదేశ్ వాతావరణ సూచన…

ప్రస్తుతము నైరుతి రుతుపవనాల ఉపసంహరణ లైన్ 27.1° N అక్షాంశము/84.7° E రేఖాంశము, మోతిహరి, గయా, డాల్టోంగాంజ్, అంబికాపూర్, మండలా, ఇండోర్, గాంధీనగర్, రాజ్‌కోట్ మరియు పోర్బందర్ల గుండా వెళుతుంది. రాబోయే 2-3 రోజుల్లో గుజరాత్, ఛత్తీస్‌గఢ్‌లోని మరికొన్ని ప్రాంతాల నుండి; మధ్యప్రదేశ్, జార్ఖండ్, బీహార్‌లోని చాలా ప్రాంతాలు నుండి; మహారాష్ట్ర, ఒడిశా మరియు పశ్చిమ బెంగాల్‌లోని కొన్ని ప్రాంతాలు నుండి నైరుతి రుతుపవనాలు ఉపసంహరణకు పరిస్థితులు అనుకూలంగా ఏర్పడ్డాయి.

ఉత్తర అండమాన్ సముద్రము మరియు దాని పరిసర ప్రాంతాలలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనం ప్రస్తుతము సగటు సముద్రమట్టానికి 5.8 సెం.మీ ఎత్తువరకు కొనసాగుతున్నది. దీని ప్రభావం వలన అదే ప్రాంతంలో రాగల 48 గంటలలో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది తదుపరి 4-5 రోజులలో మరింత బలపడి పశ్చిమ-వాయువ్య దిశలో కదలి దక్షిణ ఒడిశా & ఉత్తరకోస్తా ఆంధ్ర ప్రదేశ్ తీరాల వైపు ప్రయాణించే అవకాశం ఉంది.

ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాం :

ఈరోజు, రేపు, ఎల్లుండి ఉత్తర కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తా ఆంధ్ర :

ఈరోజు దక్షిణ కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది మరియు భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి దక్షిణ కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది .

రాయలసీమ:

ఈరోజు, రేపు రాయలసీమలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అనేక ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది మరియు భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి రాయలసీమలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది మరియు భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

Exit mobile version