ఓ ఎలుక ఏకంగా ఒక ఊరిని కాల్చి వేసింది.. ఏంటి నిజమా అంటే నిజమే అని చెప్పాలి.. తాజాగా జరిగిన ఘటన వింటే ఎవ్వరికైనా మైండ్ బ్లాక్ అవుతుంది.. ఓ మహిళ పెట్టిన దీపాన్ని దొంగిలించిన ఎలుక ఊరినే కాల్చివేసింది..ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లో వెలుగు చూసింది.. ఈ ఘటనలో ప్రాణ నష్టం జరగలేదు కానీ భారీగా ఆస్తి నష్టం జరిగిందని సమాచారం..
వివరాల్లోకి వెళితే.. విజయనగరం జిల్లాలో ఈ ఘటన జరిగింది..మెంటాడ మండలం కొండ లింగాల వలసలో అకస్మాత్తుగా అగ్నిప్రమాదం సంభవించింది. ఆ మంటల కారణంగా సుమారు ఎనిమిది ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి..ఇంట్లో ఉన్న రెండు గ్యాస్ సిలెండర్స్ పెద్ద పెద్ద శబ్దాలతో పేలాయి. శబ్దాల ధాటికి గ్రామమంతా ఉలిక్కి పడింది. అసలే మండుతున్న ఎండలు దానికి తోడు గాలులు.. ఇక చెప్పేదేముంది నిమిషాల్లో మంటలు దావానంలా పాకాయి… మంటలను ఆర్పెందుకు ప్రయత్నించినా పెద్దగా ప్రయోజనం లేకపోయింది.. ఇక చేసేదేమిలేక అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు..
వెంటనే సిబ్బంది అక్కడకు చేరుకొని దాదాపు గంటపాటు శ్రమించి మంటలను ఆర్పేశారు..అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. తరువాత గ్రామస్తులు అగ్నిప్రమాదం కి గల కారణాల పై ఆరా తీశారు.. అసలు విషయం తెలుసుకొని షాక్ అయ్యారు.. ఎలుక దీపం ను తీసుకొని వెళ్లడంతో అక్కడ ఉన్న పూరి గుడిసె దగ్ధం అయ్యింది.. మరో రెండు రోజుల్లో పండుగ ఉండటంతో ఊర్లో సందడి వాతావరణం నెలకొంది.. ఇక ఓ పూరింట్లో దేవుడికి పూజ చేసి దీపం వెలిగించి కొద్ది సేపటి తరువాత బయటకు వెళ్ళిపోయారు కుటుంబసభ్యులు. ఇంతలో ఓ ఎలుక ఇల్లంతా తిరిగి దీపం ను తీసుకెళ్లటానికి ప్రయత్నించింది. ఆ ప్రయత్నంలో నూనె తో ఉన్న దీపం ఇంటి పూరి కప్పుకు తగిలి ఒక్కసారిగా మంటలు ప్రారంభమయ్యాయి…
ఒకవైపు ఎండ మరోవైపు గాలి వేగంగా వీస్తుండటంతో మంటలు ఆటోమెటిక్ గా పెరిగాయి.. ఫైర్ ఇంజన్ వచ్చి మంటలను అదుపు చేసినప్పటికి భారీ నష్టం జరిగింది.. ఈ మంటలు ఇంకా కొన్ని ఇళ్లకి తాకి పెను ప్రమాదానికి దారి తీసింది. ఈ ప్రమాదంతో భాదితులు ఇళ్లు వాకిలి లేక కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. గ్రామంలో పండుగ వేడుకలు జరగాల్సిన సమయంలో ఎలుక పెట్టిన ఈ మంటలు మా ప్రాణాల పైకి తెచ్చింది అంటూ గుండెలు బాదుకుంటున్నారు.. ఈ ప్రమాదంలో దాదాపు రూ.5 లక్షలకు పైగా ఆస్తి నష్టం జరిగిందని అంచనా..కేసు నమోదు చేసుకున్న పోలీసులు మరిన్ని వివరాలను సేకరించే పనిలో ఉన్నారు..
