Site icon NTV Telugu

Andhra Pradesh: ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో మళ్లీ నంబర్‌వన్

Investments

Investments

కరోనా సంక్షోభంతో దేశంలోని అన్ని రాష్ట్రాలు పెట్టుబడుల విషయంలో అల్లాడుతున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం విదేశీ పెట్టుబడులు పెరిగాయి. తాజాగా ఇన్వెస్ట్ ఇండియా వెలువరించిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల్లో ఏపీ అగ్రస్థానంలో నిలవడంతో ఈ విషయం బహిర్గతమైంది. 2019 అక్టోబర్‌ నుంచి 2021 డిసెంబర్‌ వరకు రాష్ట్రంలో 451 అమెరికన్‌ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (FDI) ఏపీకి వచ్చాయిని ది నేషనల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ అండ్‌ ఫెసిలియేషన్‌ ఏజెన్సీ ఆఫ్‌ ది గవర్నమెట్‌ ఆఫ్‌ ఇండియా వెల్లడించింది.

ఏపీలో ఆరు ఓడరేవులు, ఆరు విమానాశ్రయాలు, 1,23,000 కి.మీ రహదారులు, 2,600 కి.మీ రైలు నెట్‌వర్క్ ఉండడం, 24 గంటలపాటు విద్యుత్ సరఫరా ఉన్నందున పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నట్లు ఇన్వెస్ట్ ఇండియా అభిప్రాయపడింది. కృష్ణా, గోదావరి నదీ పరీవాహక ప్రాంతాలతో నీటి వనరులు సమృద్ధిగా ఉండడంతో రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి పుష్కలమైన వనరులు ఉన్నట్లు అంచనా వేసింది. 2018-19 నాటికి ఆంధ్రప్రదేశ్ వృద్ధి రేటు జాతీయ సగటు కంటే చాలా ఎక్కువగా ఉందని… పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు ఇది కూడా ఒక కారణమై ఉండొచ్చని ఇన్వెస్ట్ ఇండియా స్పష్టం చేసింది.

Exit mobile version