Site icon NTV Telugu

ఏపీలో నైట్ కర్ఫ్యూ పొడిగింపు.. ఎప్పటివరకు అంటే?

ఏపీలో నైట్ కర్ఫ్యూను ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు ఫిబ్రవరి 14 వరకు నైట్ కర్ఫ్యూను పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం మంగళవారం మధ్యాహ్నం ఉత్తర్వులు జారీ చేసింది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ కొనసాగనుంది. తొలుత ప్రభుత్వం జనవరి 31 వరకు నైట్ కర్ఫ్యూ విధించింది. ఆ గడువు సోమవారంతో ముగియడంతో ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో నైట్ కర్ఫ్యూను పొడగించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది.

Read Also: ఇండిగో కీలక నిర్ణయం… కడప నుంచి విజయవాడ, చెన్నైకి విమానాలు

ప్రభుత్వం విధించిన కరోనా నిబంధనల ప్రకారం రాష్ట్రంలో ప్రతిఒక్కరూ మాస్కు ధరించాలి. దీనిని అతిక్రమిస్తే అధికారెలె రూ.100 జరిమానా విధిస్తారు. వివాహాలు, శుభకార్యాలు, మతపరమైన కార్యక్రమాలను బహిరంగ ప్రదేశాల్లో అయితే గరిష్టంగా 200 మంది, ఇన్‌డోర్‌లో 100 మందికి మాత్రమే అనుమతి ఉంటుంది. అటు థియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీ కొనసాగనుంది. అంటే సినిమా హాళ్లలో సీటు వదిలి సీటు విధానాన్ని పాటిస్తూ ప్రేక్షకులందరూ మాస్క్‌ ధరించాలి. ప్రజా రవాణా వాహనాల్లో సిబ్బందితో పాటు, ప్రయాణికులు మాస్క్‌లు ధరించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

Exit mobile version