High Court Serious: దక్షిణ మధ్య రైల్వే జీఎంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. ఆదేశాలు ఇచ్చినా కోర్టుకు హాజరు కాకపోవడంపై మండిపడ్డింది.. రైల్వే జనరల్ మేనేజర్ విజయవాడ డీఆర్‌ఎం కోర్టుకు రావాలని ఆదేశాలు ఇచ్చినా రాకపోవటంతో స్పందించిన హైకోర్టు.. ఈ వ్యాఖ్యలు చేసింది.. కోర్టు అంటే లెక్కలేని తనమా అని వ్యాఖ్యానించిన న్యాయస్థానం.. అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొంది.. DRM స్థాయి అధికారిని కూడా కోర్టుకు రప్పించక పోతే హైకోర్టు ఎందుకని ప్రశ్నించింది.. బెజవాడ మధురా నగర్ దగ్గర ROB ఆలస్యం వల్ల ఇబ్బందులు పడుతున్నామని దాఖలైన పిటిషన్ పై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. కాగా, గతంలోనూ అధికారులపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి.. ఇక కొందరు అధికారులకు హైకోర్టు శిక్షలు కూడా విధించిన విషయం విదితమే.. కోర్టు ఆదేశాలను పట్టించుకోని అధికారులపై మండిపడుతూనే ఉంది హైకోర్టు.
Read Also: TSPSC Paper Leak: టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీకేజీలో కీలక మలుపు