Site icon NTV Telugu

TDP: హైకోర్టులో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడికి ఊరట

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. అకారణంగా పోలీసులు తనకు నోటీసులు జారీ చేసి అరెస్టు చేయాలని ప్రయత్నిస్తోందని ఆరోపిస్తూ అయ్యన్నపాత్రుడు హైకోర్టులో క్వాష్ పిటిషన్‌ దాఖలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల పోలీసులు తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు.. అయ్యన్నపాత్రుడుపై తదుపరి చర్యలు నిలిపివేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

కాగా గతంలో పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్లలో ఎన్టీఆర్‌ విగ్రహావిష్కరణ సందర్భంగా సీఎం జగన్‌ను అసభ్య పదజాలంతో దూషించారని అయ్యన్నపాత్రుడిపై వైసీపీ నేత రామకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు బుధవారం విశాఖ జిల్లా నర్సీపట్నంలోని అయ్యన్నపాత్రుడి ఇంటికి నోటీసులు అతికించారు. అయ్యన్నపాత్రుడు ఇంట్లో లేరని కుటుంబ సభ్యులు చెప్పడంతో రాత్రంతా అక్కడే పోలీసులు గస్తీ కాశారు. ఈ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Exit mobile version