Site icon NTV Telugu

ఏపీ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం..! అగ్రవర్ణాల్లో పేదలకు 10 శాతం రిజర్వేషన్లు..!

YS Jagan

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకునేందుకు సిద్ధ‌మైంది.. అగ్రవర్ణాల్లో పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ నిర్ణయం తీసుకోనుంది ఏపీ సర్కార్… అగ్రవర్ణాల పేదలకు విద్య, ఉద్యోగ రంగాల్లో 10 శాతం రిజర్వేషన్లు అమల్లోకి తీసుకుని వచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉందంటున్నారు.. కాగా, 2019లో ఈబీసీలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తు రాజ్యాంగ సవరణ చేసింది కేంద్ర ప్ర‌భుత్వం.. ఈబీసీ రిజర్వేషన్ల ద్వారా కమ్మ, కాపు, రెడ్డి, బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు, వెలమ తదితర అగ్రవర్ణ పేదలకు మేలు జ‌రిగే అవ‌కాశం ఉంది..

Exit mobile version