NTV Telugu Site icon

ఆన్‌లైన్‌లో సినిమా టికెట్ల అమ్మకం.. సమావేశానికి ఏపీ సర్కార్‌ రెడీ

ఆన్‌లైన్‌ టిక్కెట్ల అమ్మకంపై ఈ నెల 20న సమావేశం నిర్వహించనుంది ఏపీ ప్రభుత్వం. దీనిపై చర్చించేందుకు.. సినీ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ యాజమాన్యాలను ఆహ్వానించింది. ఆన్‌లైన్‌లో టిక్కెట్లు అమ్మే అంశంపై అభిప్రాయాలు, సలహాలు తీసుకోనుంది. ఆన్ లైన్ టిక్కెట్ల అమ్మకం సొమ్మును రియల్ టైంలో ట్రాన్స్‌ఫర్ చేస్తామని ఈ సమావేశంలో ప్రభుత్వం స్పష్టం చేయనుంది. ఇప్పటికే పలువురు నిర్మాతలు.. సినీ ప్రముఖులు, థియేటర్ ఓనర్లతో అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. ఇక, ఇవాళ మీడియాతో మాట్లాడిన మంత్రి పేర్ని నాని.. నిర్ణయించిన ధరకే టికెట్లను ఆన్‌లైన్‌లో ఉంచుతామని స్పష్టం చేశారు. ప్రభుత్వం టికెట్ల వ్యాపారం చేస్తోందని ప్రతిపక్షం నోటికొచ్చినట్లు మాట్లాడుతోందని ఫైర్‌ అయ్యారు.. ప్రభుత్వం టికెట్ల వ్యాపారం చేయడం ఏంటని ప్రశ్నించిన ఆయన.. సినిమా టికెట్లను పారదర్శకంగా ప్రజలకు అందిస్తామని.. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే విక్రయాలు జరగాలని స్పష్టం చేశారు మంత్రి పేర్నినాని.