NTV Telugu Site icon

Andhra Pradesh: ఏపీ సర్కార్‌ కీలక నిర్ణయం.. 292 స్కూళ్లు హైస్కూల్​ ప్లస్‌గా అప్‌గ్రేడ్..

High School Plus

High School Plus

ఆంధ్రప్రదేశ్‌లో 292 ఉన్నత పాఠశాలలను హైస్కూల్ ప్లస్‌గా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ సర్కార్… హై స్కూల్ ప్లస్ పాఠశాలలను.. బాలికలకు ప్రత్యేకంగా కేటాయిస్తూ ఆదేశాలిచ్చారు. హై స్కూల్ ప్లస్ పాఠశాలల్లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీలలో రెండు కోర్సులు మాత్రమే అందించనున్నట్టు స్పష్టం చేసింది. స్థానికంగా ఉన్న డిమాండ్‌ను అనుసరించి కోర్సులు నిర్దారించాలని నిర్ణయించింది ప్రభుత్వం… పీజీటీ సమాన స్థాయి అధ్యాపకులనే బోధనకు తీసుకోనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. 1,752 స్కూల్ అసిస్టెంట్లను 292 జూనియర్ కళాశాలల్లో నియమించనుంది ప్రభుత్వం. ఆయా పాఠశాలల్లో నాడు-నేడు పనులు చేపట్టిన దృష్ట్యా.. ఇంకా అదనపు తరగతి గదులను మంజూరు చేయబోమని ప్రభుత్వం తేల్చి చెప్పింది.

Read Also: SBI: అలర్ట్.. మీరు ఈ పని చేయకపోతే మీ ఎస్బీఐ ఖాతా బ్లాక్..!