ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై ఏపీ ప్రభుత్వం మరోసారి సస్పెన్షన్ వేటు వేసింది. ఈ మేరకు సీఎస్ సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ప్రభుత్వంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసినందుకు, గతంలో క్రిమినల్ కేసు నమోదై ఉండటంతో అఖిల భారత సర్వీసు నిబంధనల ప్రకారం ఆయన్ను సస్పెండ్ చేస్తున్నట్లు సీఎస్ సమీర్ శర్మ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఏబీ వెంకటేశ్వరరావు ప్రింటింగ్, స్టేషనరీ, స్టోర్స్ విభాగం కమిషనర్‌గా పనిచేస్తున్నారు. 1989 ఏపీ క్యాడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు టీడీపీ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పని చేశారు. అప్పుడు రూల్స్ అతిక్రమించారన్న ఆరోపణలతో జగన్ సర్కారు గతంలో సస్పెండ్ చేసింది.
Read Also: Meena: సీనియర్ నటి మీనా భర్త కన్నుమూత
కానీ గడువు ముగిసినా తనపై సస్పెన్షన్ ఎత్తివేయకపోవడంతో ఏబీ వెంకటేశ్వరరావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో ఆయన్ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, జీతభత్యాలు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో ప్రభుత్వం దిగొచ్చి పోస్టింగ్ ఇచ్చింది. అయితే తనపై నమోదైన క్రిమినల్ కేసు విషయంలో ఏబీ వెంకటేశ్వరరావు సాక్షులను ప్రభావితం చేస్తున్నారని గుర్తించి అఖిల భారత సర్వీస్ నిబంధనల ప్రకారం సస్పెండ్ చేసినట్లు ప్రభుత్వం వివరించింది. క్రిమినల్ కేసు పెండింగులో ఉన్న అధికారి తన హోదాను దుర్వినియోగం చేస్తే సస్పెన్షన్ విధించవ చ్చని సర్వీసు నిబంధనలు స్పష్టం చేస్తున్నాయని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది.