మద్యం అమ్మకాల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఏపీ సరిహద్దు గ్రామాల్లో క్యాన్ బీర్ అమ్మకాలకు అనుమతి ఇవ్వలేదు ఏపీ ప్రభుత్వం.. రాష్ట్ర సరిహద్దుల్లో 90 ఎంఎల్ పరిమాణంలో మద్యం అమ్మకాలకు మాత్రమే ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. అక్రమ రవాణా, నాటు సారా, గంజాయి వినియోగం తగ్గించేందుకు క్యాన్ బీర్ బాటిళ్లకు అనుమతించలేదని.. 90 ఎంఎల్ లిక్కర్‌కు అనుమతిచ్చామంటోంది ప్రభుత్వం. ఎక్సైజ్ శాఖ పరిధిలోని కెమికల్ ల్యాబ్స్ ఆధునికీకరణకు నిర్ణయం తీసుకుంది.. ఆధునీకరణ కోసం ఒక్కో కెమికల్ ల్యాబ్ కు రూ. 5 లక్షలు కేటాయించింది సర్కార్.. ప్రభుత్వ లిక్కర్ వాక్ ఇన్ స్టోర్స్‌లో మద్యం ధరల పట్టిక ఉండేలా చర్యలు తీసుకోనున్నారు ఎక్సైజ్ శాఖ.. మద్యం స్టాక్ ఆడిట్ కోసం స్వయం ప్రతిపత్తి కలిగిన ఆడిట్ పార్టీ ఏర్పాటుకు ఎక్సైజ్ శాఖ నిర్ణయం తీసుకుంది.. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి బాధ్యతలు నిర్వహించనుంది స్పెషల్ ఆడిట్ పార్టీ..
మద్యం అమ్మకాలు.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
