Andhra Pradesh: ప్రైవేట్, అన్ ఎయిడెడ్ స్కూళ్లల్లో పేద విద్యార్థుల అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. వచ్చే నెల నాలుగో తేదీ నుంచి ప్రైవేట్ స్కూళ్లల్లో పేదల అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభించనుంది.. మార్చి 18వ తేదీ నుంచి ఏప్రిల్ 7వ తేదీ వరకు అడ్మిషన్ల స్వీకరణ జరుగుతోంది.. అయితే, ప్రైవేట్ స్కూళ్లల్లో పేదల అడ్మిషన్ల కోసం 25 శాతం సీట్లు రిజర్వ్ చేసింది ఆంధ్రప్రదేశ్ సర్కార్.. అందులో ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 4 శాతం, ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు 6 శాతం, అనాథలు, వికలాంగులు, హెచ్ఐవీ బాధితులకు 5 శాతం మేర ప్రైవేట్ స్కూళ్లల్లో కోటా కేటాయించింది..
Read Also: Top Headlines @ 9 AM: టాప్ న్యూస్
ఇక, ప్రైవేట్ స్కూళ్లల్లో అడ్మిషన్లు తీసుకున్న పేదలకు అమ్మఒడి వర్తింపజేయనుంది వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం.. ప్రభుత్వం నిర్ధారించిన ఫీజులను అమ్మఒడి నుంచి ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలకు చెల్లించాలని స్పష్టం చేసింది ప్రభుత్వం.. ఏ తరగతికైనా ఒకే విధమైన ఫీజు నిర్ధారించారు.. అర్బన్ ప్రాంతంలో రూ. 8 వేలు, రూరల్ ప్రాంతంలో రూ. 6500, గిరిజన ప్రాంతంలో రూ. 5100గా ఫీజు నిర్ణయించారు.. అమ్మఒడి ద్వారా వచ్చిన మొత్తంలో ప్రభుత్వం నిర్ధారించిన విధంగా ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలకు చెల్లించాలని లబ్దిదారులకు సూచించింది ప్రభుత్వం.. లబ్దిదారులు ఫీజులు చెల్లించకుంటే అరవై రోజుల్లో ప్రభుత్వమే స్కూళ్ల యాజమాన్యాలకు చెల్లిస్తుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.. ఫీజులు చెల్లించని లబ్దిదారులకు ఆ తర్వాత యేడాది జరిపే అమ్మఒడి చెల్లింపులో కోత విధిస్తామని స్పష్టం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.