NTV Telugu Site icon

ఏపీకి వ్యాక్సిన్ వ‌చ్చేస్తోంది…

Covishield

క‌రోనా వ్యాక్సిన్ నిల్వ‌లు జీరోకు చేరుకోవ‌డంతో.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వ్యాక్సినేష‌న్ ఆగిపోయిన ప‌రిస్థితి.. అయితే, ఏపీకి గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర ప్ర‌భుత్వం.. త‌మ‌కు వ్యాక్సిన్ కావాలంటూ ఏపీ స‌ర్కార్ చేసిన విజ్ఞ‌ప్తికి స్పందించిన కేంద్రం.. 5 ల‌క్ష‌ల డోసుల వ్యాక్సిన్‌ను ఏపీకి పంప‌నుంది.. రేపు రాష్ట్రానికి రానున్నాయి 5 లక్షల కరోనా వ్యాక్సిన్ డోసులు.. ఫుణెలోని సీరం ఇనిస్టిట్యూట్ నుంచి శ‌నివారం ఏపీకి చేరుకోనున్నాయి కోవిషీల్డ్ టీకా డోసులు.. మొద‌ట గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి పంప‌నున్న అధికారులు.. అక్కడి నుంచి వైద్య, ఆరోగ్యశాఖ ఆదేశాలతో అన్ని జిల్లాలకు వ్యాక్సిన్‌ను త‌ర‌లించ‌నున్నారు.. కాగా, రెండు రోజులుగా ఏపీలో కరోనా వ్యాక్సిన్ కొర‌త ఏర్ప‌డ‌డంతో.. కరోనా టీకా మహోత్సవం నిలిచిపోయిన సంగ‌తి తెలిసిందే.. ఇక‌, ఇప్పుడు వ్యాక్సిన్ వ‌స్తుండ‌డంతో.. తిరిగి కరోనా వ్యాక్సిన్ ను కేంద్రాల్లో వేయటానికి సిద్దమవుతున్నారు అధికారులు, సిబ్బంది.