NTV Telugu Site icon

ఫైబ‌ర్ ప‌ని అయిపోలేదు.. రూ.97కే ఇంటింటికి హైస్పీడ్ ఇంట‌ర్ నెట్..

Goutham Reddy

టీడీపీ హ‌యాంలో ఫైబ‌ర్ గ్రిడ్ ఏర్పాటు చేశారు.. ఇంటింటికీ ఇంట‌ర్‌నెట్ స‌దుపాయం క‌ల్పించ‌డ‌మే ల‌క్ష్యం అని ప్ర‌క‌టించారు.. అయితే, ఏపీలో వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఫైర్ గ్రిడ్ ప‌నిఅయిపోయింద‌ని.. ఇక ఇంటింటికి నెట్ వ‌చ్చే ప‌రిస్థితి లేదంటూ టీడీపీ నేత‌లు విమ‌ర్శ‌లు చేస్తూ వ‌స్తున్నారు. ఆ విమ‌ర్శ‌ల‌కు కౌంట‌ర్ ఇచ్చారు ఏపీ ఫైబ‌ర్ నెట్ చైర్మ‌న్ గౌత‌మ్‌రెడ్డి… గత టిడిపి ప్రభుత్వం చేసినా అవినీతి మూలంగా ఏపీ ఫైబర్ నెట్ నష్టాల్లో చూపించార‌న్న ఆయ‌న‌.. ప్రైవేట్ నెట్ చానల్స్ కు లాభం వస్తుంటే, ప్రభుత్వ ఛానల్ కు ఎందుకు నష్టం వ‌స్తుంది? అని ప్ర‌శ్నించారు.. కేంద్ర ప్రభుత్వ సహకారంతో అండర్ కేబుల్ వర్క్ ద్వారా ఏపీలోని ప్రతి ఇంటింటికి ఇంట‌ర్‌నెట్ అందిస్తామ‌ని స్ప‌ష్టం చేసిన గౌత‌మ్‌రెడ్డి.. 15ఎంబీపీఎస్ స్పీడ్‌తో కేవలం 97 రూపాయలకే హై స్పీడ్‌తో ఇంటింటికి ఇంట‌ర్‌నెట్ ఇవ్వ‌నున్న‌ట్టు తెలిపారు. ప్రతి ఫ్యామిలీకి వినోదాన్ని పంచేందుకు అతి తక్కువ ధరతో సేవలు అందిస్తామ‌న్న ఆయ‌న‌.. తమ ఫైబర్ పని అయిపోయిందని అవాకులు చవాకులు చేస్తున్న వారిని కదిలించేలా క‌స్ట‌మ‌ర్ల‌కు సెట‌ప్ బాక్స్‌ల‌ను కూడా అందించి ఫైబ‌ర్ సేవ‌ల‌ను మొద‌టి స్థానానికి తీసుకెళ్తామ‌ని వెల్ల‌డించారు.

Show comments