NTV Telugu Site icon

ఏపీలో భారీగా పెరిగి‌న క‌రోనా కేసులు

AP Covid 19

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా సెకండ్ వేవ్ విజృంభ‌ణ కొన‌సాగుతూనే ఉంది.. మ‌రోసారి భారీగా కొత్త కేసులు వెలుగు చూశాయి.. ఏపీ స‌ర్కార్ విడుద‌ల చేసిన తాజా క‌రోనా బులెటిన్ ప్ర‌కారం.. రాష్ట్రంలో కొత్త‌గా 24,171 కొత్త పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి.. ఇక మృతుల సంఖ్య సెంచ‌రీ దాటేసి 24 గంట‌ల్లో 101 మంది మృతిచెందారు.. ఇదే స‌మ‌యంలో 21,101 మంది పూర్తిస్థాయిలో కోలుకున్న‌ట్టు బులెటిన్‌లో పేర్కొంది స‌ర్కార్. దీంతో.. రాష్ట్రం లో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య‌ 14,32,596 కి చేరుకోగా.. ఇప్ప‌టి వ‌ర‌కు కోలుకున్న‌వారి సంఖ్య 12,12,788కి పెరిగింది.. కోవిడ్‌తో ఇప్ప‌టి వ‌ర‌కు 9,372 మంది మరణించ‌గా.. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 2,10,436గా ఉంది.