ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరిగాయి.. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం… గత 24 గంటల్లో నిన్న ఉదయం 9 గంటల నుంచి ఇవాళ ఉదయం 9 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 91,231 సాంపిల్స్ పరీక్షించగా.. 3,620 మంది పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో 41 మంది కోవిడ్‌తో మృతిచెందారు.. చిత్తూరు జిల్లాలో ఏడుగురు, కృష్ణా జిల్లాలో ఆరుగురు, తూర్పు గోదావరి, ప్రకాశం జిల్లాలో ఐదుగురు చొప్పున, గూంటురు, పశ్చిమ గోదావరిలో నలుగురు చొప్పున, శ్రీకాకుళంలో ముగ్గురు, అనంతపూర్, విశాఖపట్నంలో ఇద్దరు చొప్పున, కర్నూల్, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతిచెందారు. ఇదే సమయంలో 5,757 మంది కరోనా బాధితులు సంపూర్ణంగా కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది. ఇక, నేటి వరకు 2,18,95,922 సాంపిల్స్ ని పరీక్షించినట్టు ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 18,85,716కు చేరుకోగా… రికవరీ కేసులు 18,32,971కు పెరిగాయి.. ఇప్పటి వరకు కోవిడ్‌తో 12,671 మంది మృతిచెందారు.. ప్రస్తుతం రాష్ట్రంలో 40,074 యాక్టివ్ కేసులు ఉన్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.
ఏపీలో మళ్లీ పెరిగిన కోవిడ్ కేసులు

COVID 19 AP