NTV Telugu Site icon

AP COVID 19: మరింత కిందకు రోజువారి కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య మరింత తగ్గింది… రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 22,339 శాంపిల్స్‌ పరీక్షించగా.. కొత్తగా 528 మందికి కోవిడ్‌ పాజిటివ్‌గా తేలింది.. చిత్తూరు, కృష్ణా జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున ఇవాళ ఇద్దరు మృతి చెందారు.. ఇదే సమయంలో 1,864 మంది కోవిడ్‌ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్‌.

Read Also: Pawan Kalyan: సభ్యత్వ నమోదుకు జనసేనాని పిలుపు

ఇక, రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా టెస్ట్‌ల సంఖ్య 3,29,16,247కు చేరుకోగా… మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 23,15,030కి పెరింది… ఇప్పటి వరకు 22,90,583 మంది కోవిడ్‌ నుంచి పూర్తిస్థాయిలో కోలుకోగా.. 14,707 మంది కోవిడ్‌తో కన్నుమూశారు.. ప్రస్తుతం రాష్ట్రంలో 9,470 యాక్టివ్‌ కేసులు ఉన్నట్టు బులెటిన్‌లో వెల్లడించింది ప్రభుత్వం.. తాజా కేసుల్లో అత్యధికంగా తూర్పు గోదావరిలో 101, పశ్చిమ గోదావరిలో 92, గుంటూరులో 73, కృష్ణా జిల్లాలో 57 కేసులు వెలుగు చూశాయి.