NTV Telugu Site icon

ఏపీలో నాలుగు వేలు దాటినా కరోనా కేసులు…

ap corona

ap corona

ఏపీలో రోజువారీ కరోనా కేసులు నాలుగు వేలు దాటేశాయి. తాజా కరోనా బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 4,228 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 9,32,892 కు చేరింది. అందులో 8,99,721 మంది కోలుకొని డిశ్చార్జి కాగా, 25,850 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనా కారణంగా 10 మంది మృతి చెందారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు కరోనాతో 7,321  మంది మృతి చెందారు. ఇకపోతే గడిచిన 24 గంటల్లో ఏపీలో 1,483 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 35,582 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.