NTV Telugu Site icon

AP Tourism coffee table books: ఏపీ టూరిజం బుక్‌ను ఆవిష్కరించిన సీఎం జగన్..

Ap Tourism Coffee Table Boo

Ap Tourism Coffee Table Boo

AP Tourism coffee table books: ఆంధ్రప్రదేశ్‌ టూరిజం శాఖ రూపొందించిన ఏపీ టూరిజం కాఫీ టేబుల్‌ బుక్స్‌ను ఆవిష్కరించారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. మార్చి 3, 4 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న ఏపీ గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ 2023 నేపథ్యంలో ఏపీ టూరిజం, హ్యండీక్రాఫ్ట్స్, టెంపుల్స్, బీచ్‌లు, సోల్స్‌ స్పేస్, ఏ టూ జెడ్‌ టేబుల్‌ గైడ్‌ పై ప్రత్యేక పుస్తకాలను ప్రచురించింది ఏపీ ప్రభుత్వం.. ఇంగ్లీష్, జర్మన్, స్పానిష్, చైనీస్‌ బాషల్లో ఈ పుస్తకాలను ముద్రించారు.. ఎయిర్‌పోర్ట్‌ లాంజ్‌లు, వివిధ దేశాల రాయబార కార్యాలయాలు, టూరిజం సెంటర్స్‌లో ఏపీ ప్రత్యేకతలను ఈ పుస్తకాల్లో వివరించారు.. ఇవాళ తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో ఆ బుక్స్‌ను ఆవిష్కరించారు సీఎం వైఎస్‌ జగన్‌.

Read Also: CM YS Jagan: విద్యుత్‌ శాఖపై సీఎం జగన్‌ సమీక్ష.. కరెంట్‌ కోతలు, వ్యవసాయ కనెక్షన్లపై కీలక నిర్ణయం

ఏపీలో టూరిజం, పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణంపై ఈ పుస్తకాలలో ప్రత్యేక కథనాలు పొందుపర్చారు.. బెస్ట్‌ టూరిజం పాలసీ అవార్డును కైవసం చేసుకున్న ఏపీ ప్రభుత్వ టూరిజం శాఖ, ఇతర రాష్ట్రాలు కూడా ఏపీ టూరిజం పాలసీని అధ్యయనం చేస్తున్నాయని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ దృష్టికి తీసుకెళ్లారు టూరిజం శాఖ అధికారులు. దీంతో.. వారిని అభినందించిన ముఖ్యమంత్రి, రానున్న రోజుల్లో టూరిజం డెస్టినేషన్‌ హబ్‌గా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో నెంబర్‌ వన్‌ గా ఉన్న రాష్ట్రాన్ని అన్ని రంగాలలోనూ అభివృద్ది పథంలో నడిపిస్తూ, పెట్టుబడులకు స్వర్గధామంగా తీర్చిదిద్దేలా ముందుకు సాగాలన్నారు సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి..