NTV Telugu Site icon

Kadapa Steel Plant: నాన్నగారి కల నిజం అవుతుంది.. ఈ ప్రాంతమంతా అభివృద్ధి..!

Cm Jagan

Cm Jagan

Kadapa Steel Plant: స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతో మొత్తం కడప జిల్లాయే కాదు ప్రాంతమంతా అభివృద్ధి అవుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. కడప జిల్లా సున్నపురాళ్ళ పల్లిలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్స్‌కు ఇవాళ భూమి పూజ చేశారు సీఎం వైఎస్‌ జగన్‌, జిందాల్ చైర్మన్‌ సజ్జన్ జిందాల్.. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, మంత్రి అమర్నాథ్ రెడ్డి, ఎంపీ వైఎస్‌ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా ఓ చిన్న కార్యక్రమంలా పరిశ్రమ భూమి పూజ నిర్వహిస్తున్నాం.. స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతో మొత్తం జిల్లా, ప్రాంతమంతా అభివృద్ధి అవుతుందన్నారు. గతంలో స్టీల్‌ ప్లాంట్‌ కోసం వైఎస్ ఎన్నో కలలు కన్నారు.. అనాడు స్టీల్ ప్లాంట్ కోసం పరితపించారు.. కానీ, తర్వాత వచ్చిన ప్రభుత్వాలు పట్టించుకోలేదని మండిపడ్డారు.. అయితే, దేవుడి దయవల్ల నేడు జిందాల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు అవుతోందని ఆనందం వ్యక్తం చేశారు సీఎం జగన్.

Read Also: AP Three Capitals: వాటిని వదులుకోకూడదనే మూడు రాజధానులు..

మూడు దశల్లో జిందాల్‌ స్టీల్‌ ప్లాంట్‌ పరిశ్రమ నిర్మాణం జరుగుతుందని.. 36 నెలల్లో 3300 కోట్లతో మొదటి దశ.. మరో ఐదేళ్ల మొత్తం పరిశ్రమ నిర్మాణం పూర్తి చేసుకోనుందని వెల్లడించారు సీఎం వైఎస్‌ జగన్‌.. మూడు మిలియన్ టన్నుల తో కాదు ఇంకా పెరుగు తుందనే ధీమా వ్యక్తం చేసిన ఆయన.. ప్లాంట్ సపోర్ట్ కోసం చాలా కష్ట పడ్డాం.. మంచి రోజులు వచ్చాయి. 4 వేల కోట్లతో 3500 ఎకరాల భూమి, 700 కోట్ల మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తోందన్నారు. స్టీల్ సిటీ కావాలనే అభివృద్ధి పనులు చేస్తున్నామని తెలిపారు. ఇక, కొప్పర్తిలో ఎలక్ట్రానిక్ మ్యానిఫ్యాక్చరింగ్‌ క్లస్టర్‌ ఏర్పాటు చేస్తాం.. లక్ష మందికి ఉపాధి లభిస్తుంది.. జగనన్న ఇండస్ట్రియల్ పార్కు అభివృద్ధి చేస్తోందన్నారు.. స్థానికులకు 74 శాతం కల్పన దిశగా చట్టం చేశామని ఈ సందర్భంగా గుర్తు చేశారు.. గడచిన మూడేళ్లలో పెట్టుబడిదారులకు అనుకూల మైన రాష్ట్రంగా నిలిచింది.. దేశ వ్యాప్తంగా ఎంతో మంది పెట్టుబడిదారులు ఈ రాష్ట్రం వైపు చూస్తూ ముందుకు వస్తున్నారని.. జిందాల్ పరిశ్రమ కోసం రాష్ట్ర ప్రభుత్వ తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ప్రకటించారు సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.

Show comments