Site icon NTV Telugu

YS Jagan: దిశ పెట్రోలింగ్‌ వెహికల్స్‌ ప్రారంభం.. ఫోన్‌ 5 సార్లు ఊపితే చాలు..!

మహిళల భద్రత కోసం ఇప్పటికే ప్రత్యేక చట్టాలను తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. ఇప్పుడు మరో ముందడుగు వేసింది.. వారి భద్రత కోసం ప్రత్యేక దిశ పెట్రోలింగ్‌ వెహికల్స్‌ను తీసుకొచ్చింది.. సచివాలయంలో దిశ పెట్రోలింగ్‌ వెహికల్స్‌ను ప్రారంభించారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. 163 ఫోర్ వీలర్ వాహనాలను లాంఛనంగా ప్రారంభించారు.. మహిళా సిబ్బందికి ప్రత్యేకంగా 18 దిశ మొబైల్ విశ్రాంతి వాహనాలు ఏర్పాటు చేశారు.. ఇప్పటికే అన్ని పోలీస్ స్టేషన్లకు 900 ద్విచక్ర వాహనాలు మహిళల రక్షణ కోసం పంపిణీ చేసింది సర్కార్.. జిల్లా యూనిట్ కంట్రోల్ రూం నుండి నేరుగా ప్రత్యక్ష పర్యవేక్షణకు అనుగుణంగా ఈ వాహనాలకు జీపీఎస్‌ ట్రాకింగ్ వ్యవస్థ ఏర్పాటు చేశారు.

Read Also: Pollution: కాలుష్య భారతం.. టాప్‌ 50 సిటీల్లో మనవే 35…!

ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. 1 కోటి 16 లక్షల మంది అక్క చెల్లెమ్మల చేతిలో దిశా యాప్‌ ఉందని.. ప్రమాదంలో ఉన్నప్పుడు చేతిలోని సెల్‌ఫోన్‌ను ఐదు సార్లు ఊపితే 10 నిమిషాలలోనే పోలీస్లు అక్కడికి చేరుకుంటారని వెల్లడించారు.. మహిళల భద్రత కోసం 163 మొబైల్ వాహనాలు అందుబాటులోకి తీసుకుని వచ్చిమని తెలిపిన ఏపీ సీఎం.. గతంలో పోలీస్ స్టేషన్లలో మహిళలకు బాత్ రూమ్‌లు కూడా ఉండేవే కాదని ఆవేదన వ్యక్తం చేశారు.. ఇప్పుడు ఆ పరిస్థితి పోయింది.. ప్రతి పోలీస్ స్టేషన్‌లో మహిళల కోసం బాత్‌ రూమ్‌లు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.. ఏ పోలీస్ చెల్లెమ్మ అయినా తాను డ్యూటీలో ఇబ్బంది పడకుండా మొబైల్ రెస్ట్ రూమ్‌ వాహనాలు ప్రారంభించామని తెలిపారు ఏపీ సీఎం వైఎస్‌ జగన్.

Exit mobile version