Site icon NTV Telugu

రిటైర్డ్ ఐఏఎస్ లక్ష్మీనారాయణకు ఏపీ సీఐడీ నోటీసులు

రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్‌ డాక్టర్‌ లక్ష్మీనారాయణకు నోటీసులు జారీ చేసింది ఏపీ సీఐడీ… లక్ష్మీనారాయణ ఇంట్లో ఇవాళ సోదాలు నిర్వహించింది ఏపీ సీఐడీ.. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఓఎస్డీగా పనిచేసిన ఆయన.. పదవీ విరమణ తర్వాత ఏపీ ప్రభుత్వానికి సలహాదారుగా కూడా పనిచేశారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సంస్థ ద్వారా సేవలందించారు. యువతకు ట్రైనింగ్‌ ఇచ్చే క్రమంలో అక్రమాలకు పాల్పడ్డారని ఆయనపై ఆరోపణలు రావడంతో.. ఇవాళ లక్ష్మీనారాయణ ఇంట్లో సోదాలు నిర్వహించారు అధికారులు..

Read Also: శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త

అయితే, 2017 జీవో ఎంఎస్-4 గురించి తనకు తెలియదని లక్ష్మీనారాయణ చెబుతున్నారు. తాను డైరెక్టర్‌గా ఉన్నప్పుడు 8 మంది ఎండీలు మారారని, కమిషనర్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఉన్న సమయంలో రిటైర్డ్ అయ్యానని తెలిపారు. సిమెన్స్‌తో ఎలాంటి ఒప్పందం కుదిరిందని ఏపీ సీఐడీ ప్రశ్నించారు. ఇక, లక్ష్మీనారాయణపై ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది.. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో ఏ2గా ఆయన పేరును చేర్చింది సీఐడీ.. మొత్తం 13 మంది పేర్లను ఎఫ్ఐఆర్‌లో పేర్కొంది. సోదాల తర్వాత ఆయనకు నోటీసులు ఇచ్చిన సీఐడీ అధికారులు.. ఈనెల 13వ తేదీన తమ ముందు విచారణకు హాజరుకావాలంటూ ఆ నోటీసులలో పేర్కొన్నారు.

Exit mobile version