Site icon NTV Telugu

Andhra Pradesh: ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయం.. రెండో భాషగా ఉర్దూ

ఏపీ కేబినెట్ జగన్ సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రెండో భాషగా ఉర్దూను గుర్తిస్తూ కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ కేబినెట్ అందుకోసం ఏపీ అధికార భాషా చ‌ట్టం 1966కు స‌వ‌ర‌ణ చేయాల‌ని కూడా తీర్మానించింది. సోమవారం మధ్యాహ్నం జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో 35 కీలక అంశాలపై చర్చ జరిగింది. విదేశీ మద్యం నియంత్రణ చట్ట సవరణకు కూడా ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో నిజాంప‌ట్నం, మ‌చిలీప‌ట్నం, ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ల ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.

మరోవైపు మ‌చిలీప‌ట్నం, భావ‌న‌పాడు, రామాయ‌ప‌ట్నం పోర్టుల నిర్మాణం కోసం రూ.8,741 కోట్ల రుణ స‌మీక‌ర‌ణ‌కు ఏపీ మారిటైం బోర్డుకు హామీ ఇచ్చేందుకు ఏపీ మంత్రివర్గం అంగీక‌రించింది. మ‌డ‌క‌శిర బ్రాంచ్ కెనాల్ ప‌నుల‌కు రూ.214 కోట్లు కేటాయిస్తూ ఏపీ కేబినెట్ తీర్మానించింది. మరోవైపు టీటీడీలో ప్రత్యేక ఆహ్వానితుల నియామకం కోసం హిందూ ధార్మిక సంస్థల చట్టానికి సవరణ చేయాలని తీర్మానించింది. రూ.8741 కోట్ల రుణ సమీకరణకు ఏపీ మారిటైం బోర్డుకు హామీ ఉండేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

https://ntvtelugu.com/minister-bosta-said-that-hyderabad-is-ap-capital-until-2024/
Exit mobile version