ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన ఇవాళ జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరిగింది… ఈ భేటీలో పలు నిర్ణయాలకు ఆమోదం లభించింది… సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి పేర్నినాని.. కేబినెట్ నిర్ణయాలను మీడియాకు వివరించారు…
ఏపీ కేబినెట్ నిర్ణయాలు:
- వైఎస్సార్ జయంతి జులై 8వ తేదీన భారీ ఎత్తున రైతు దినోత్సవ కార్యక్రమం
- పార్లమెంట్ నియోజకవర్గానికో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు నిర్ణయం.
- ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికో వెటర్నరీ అంబులెన్సుల ఏర్పాటుకు ఆమోదం.
- రూ. 89 కోట్లతో వెటర్నరీ అంబులెన్సుల కొనుగోళ్లకు నిర్ణయం.
- వైఎస్సార్ బీమా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా అమలు చేయాలని నిర్ణయం.
- పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా ఇళ్ల నిర్మాణానికి సామూహిక శంకుస్థాపనలు..
- జులై 1, 3, 4 తేదీల్లో శంకుస్థాపనల స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని నిర్ణయం.
- అమ్మఒడి, జగనన్న వసతి దీవెన పథక లబ్ధిదారులకు ల్యాప్ టాప్ అందించే సౌకర్యం కల్పించేలా నిర్ణయం.
- అమ్మఒడి లబ్ధిదారుల్లో 34 శాతం మంది ల్యాప్ టాప్ కావాలని కోరారని మంత్రి వెల్లడి.
- ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో యూనివర్శిటీల ఏర్పాటుకు నిర్ణయం.
- మధ్య తరగతి ప్రజలకు సొంతిళ్లు కల్పించే దిశగా చర్యలు.
- జగనన్న స్మార్ట్ టౌన్ షిప్స్ ఏర్పాటు.
- ప్రభుత్వ, ప్రైవేట్ స్థలాల్లో లే అవుట్ల అభివృద్ధికి నిర్ణయం.
- 150, 200, 240 గజాల్లో ఇళ్ల స్థలాలని ఇచ్చేలా నిర్ణయం.
- లాభాప్రేక్ష లేకుండా వాస్తవ ఖర్చుతో ఇళ్లని ఇవ్వాలని నిర్ణయం.
- గ్రామ కంఠాల్లో నివాసముంటున్న పేదల ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ.
- ప్రతి పీహెచ్‌సీ పరిధిలో 104 అందుబాటులో ఉండేలా చర్యలు.
- 539.. 104 అంబులెన్సుల కొనుగోలుకు నిర్ణయం.
- పీహెచ్‌సీల్లో ఒకరు.. 104లో మరో డాక్టర్ ఉండాలని ఆదేశం.