AP Assembly Sessions: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. నేటి ఉదయం 9 గంటలకు శాసన సభ, 10 గంటలకు మండలి సమావేశాలు ప్రారంభం అవుతాయి. అయితే, మొదటి రోజు క్వశ్చన్ అవర్ తో సమావేశాలు జరగనున్నాయి. ఇక, అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత బీఏసీ సమావేశం జరగనుంది. ఇందులో అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు జరపాలి అనే అంశంపై చర్చించనున్నారు. ఈ సమావేశాల్లో పంచాయితీ, మున్సిపల్ చట్ట సవరణ, నాలా చట్ట సవరణలతో పాటు కీలక బిల్లులను ప్రభుత్వం ప్రవేశ పెట్టనుంది.అయితే, ఈ అసెంబ్లీ సమావేశాలకు వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు రాకపై ఉత్కంఠ కొనసాగుతుంది.ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్యేలు అందరు సభకు రావాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు కోరారు.
Read Also: Hyderabad Rains: హైదరాబాద్‌లో వర్షం.. వరద నీటిలో మునిగి యువకుడి మృతి!
సభలో ప్రవేశపెట్టనున్న బిల్లులు..
* ఆంధ్ర ప్రదేశ్ అనుసూచిత కులాల ఆర్డినెన్స్..
* ఆంధ్ర ప్రదేశ్ మోటారు వాహనాల పన్ను సవరణ ఆర్డినెన్స్..
* పురపాలక శాసనాల సవరణ ఆర్డినెన్స్..
* వ్యవసాయ భూమిని వ్యవసాయేతర ప్రయోజనాల కోసం మార్పిడి సవరణ ఆర్డినెన్స్..
* వ్యవసాయ పరిశ్రమల అభివృద్ధి సంస్థ 53వ వార్షిక నివేదిక..
* ఆహార శుద్ధి సంస్థ వార్షిక లెక్కలు..
ఇవాళ్టి ప్రశ్నోత్తరాలు..
* పీహెచ్సీ బిల్డింగులు..
* 50 ఏళ్లకు పింఛను పథకం..
* గ్రామాల అనుసంధాన రోడ్ల అభివృద్ధి..
* బెల్టు షాపులు, నకిలీ మద్యం అమ్మకాలు..
* పంచాయతీలలో పారిశుధ్య వ్యవస్థ..
* కరేడు గ్రామంలో భూసేకరణ..
* చక్కెర పరిశ్రమల పునరుద్ధరణ..
* తిరుపతి, సింహాచలం ఆలయాల వద్ద విషాదకర ఘటనలు..
* ఎన్ఆర్ హెచ్ఎం అండ్ ఎన్ యూహెచ్ఎం ద్వారా సేవలు..
* కడప ఉక్కు కర్మాగార నిర్మాణ పనులు..
