Site icon NTV Telugu

ఏపీలో 95.. తెలంగాణలో 172… కరోనా కేసుల లెక్క..!!

ఏపీలో గడిచిన 24 గంటల్లో 27,233 శాంపిల్స్‌ను పరీక్షించగా 95 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. తాజా కేసులతో ఏపీలో ఇప్పటివరకు మొత్తం 20,75,974 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో ఒకరు (కృష్ణా జిల్లా) మరణించగా ఇప్పటివరకు మొత్తం మరణాల సంఖ్య 14,481కి చేరింది. నిన్న 179 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు 20,60,061 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరోవైపు రాష్ట్రంలో ఇంకా 1,432 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 26 కేసులు, గుంటూరు జిల్లాలో 15 కేసులు వెలుగు చూశాయి. కర్నూలు, విజయనగరం జిల్లాలలో కేసులేవీ నమోదు కాలేదు.

మరోవైపు తెలంగాణలో మాత్రం గడిచిన 24 గంటల్లో 39,919 కరోనా పరీక్షలు నిర్వహించగా 172 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 6,79,892 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 4,016 మంది కరోనాతో మరణించారు. రాష్ట్రంలో 6,72,251 మంది కరోనా నుంచి కోలుకోగా…. ఇంకా 3,625 మంది చికిత్స పొందుతున్నారు. కొత్తగా నమోదైన కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 86, రంగారెడ్డి జిల్లాలో 20 ఉన్నాయి.

Exit mobile version