Ap 10th Class Results: ఏపీలో పదో తరగతి సప్లిమెంటరీ, బెటర్‌మెంట్ పరీక్షలు రాసిన వారికి అధికారులు కీలక వార్తను అందించారు. పదో తరగతి సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలపై అధికారులు సోమవారం నాడు కీలక ప్రకటన చేశారు. ఈ పరీక్ష ఫలితాలను బుధవారం నాడు మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేస్తారని తెలిపారు. బుధవారం ఉదయం 10 గంటలకు విజయవాడలోని లెమన్ ట్రీ హోటల్‌లో మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేస్తారని వివరించారు. కాగా జూలై 6 నుంచి 15 వరకు ఏపీలో పదో తరగతి సప్లిమెంటరీ, బెటర్‌మెంట్ పరీక్షలను అధికారులు నిర్వహించారు. రాష్ట్రంలో 2,01,627 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు.
Read Also: Osmania University : ఓయూ పీహెచ్‌డీ నోటిఫికేషన్ విడుదల
కాగా ఈ ఏడాది 8,609 మంది విద్యార్ధులు బెటర్మెంట్ పరీక్షలు రాశారు. బెటర్మెంటు రాసిన వారిలో బాలురు 4,737 మంది, బాలికలు 3,872 మంది ఉన్నారు. సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించి 90,334 మంది బాలికలు, 1,16,826 మంది బాలురు హాజరైనట్లు అధికారులు తెలిపారు. ఈ పరీక్షలకు హాజరైన విద్యార్థులు ఫలితాలు వెలువడిన అనంతరం https://bse.ap.gov.in/ వెబ్‌సైట్ ద్వారా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది పదో తరగతి విద్యార్థులకు బెటర్‌మెంట్ పరీక్షను రాసే అవకాశం కల్పించారు. ఇటీవల ప్రకటించిన ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించి తక్కువ మార్కులు సాధించిన విద్యార్థుల కోసం ఈ అవకాశాన్ని కల్పించారు.
