Site icon NTV Telugu

Job at Google: అదరగొట్టిన తెలుగు కుర్రాడు.. ఏకంగా 2.25 కోట్ల ప్యాకేజీతో కొలువు..!

Untitled Design (5)

Untitled Design (5)

ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లాకు చెందిన ఓ యువకుడు అద్భుతమైన మైలురాయిని సాధించాడు. తాడిపత్రికి చెందిన కోనాదుల సాత్విక్ రెడ్డి, ₹2.25 కోట్ల వార్షిక ప్యాకేజీతో కాలిఫోర్నియాని గూగుల్ కార్యాలయంలో ఉద్యోగం సంపాదించాడు. దీంతో తెలుగోడి సత్తా ప్రపంచ దేశాలకు పాకింది.

Read Also: Wife Attacked Husband: ఏందమ్మా ఇది.. భర్త ఇళ్లు క్లీన్ చేయలేదని.. ఆ ఇళ్లాలు ఏం చేసిందో తెలుసా…

పూర్త వివరాల్లోకి వెళితే.. సాత్విక్ అమెరికాలోని ప్రతిష్టాత్మక స్టోనీ బ్రూక్ విశ్వవిద్యాలయం నుండి ఇంజనీరింగ్ డిగ్రీని పొందాడని అతడి తండ్రి కొనాదుల రమేశ్ రెడ్డి వెల్లడించారు. అతని అంకితభావం, కృషి మరియు టెక్నాలజీ పట్ల మక్కువ ఇప్పుడు అతనికి ప్రపంచంలోని అగ్రశ్రేణి టెక్నాలజీ కంపెనీలలో ఒకదానిలో స్థానం సంపాదించిపెట్టాయని ఆయన తెలిపారు. అనంతపురం స్థానికుడుసాత్విక్ రెడ్డిని గూగుల్ కాలిఫోర్నియా కార్యాలయంలో ₹2.25 కోట్ల వార్షిక జీతంతో నియమించారు..

Read Also:KTR: ఆటోలో తెలంగాణ భవన్ కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్

సాత్విక్ రెడ్డి సాధించిన విజయం ఆంధ్రప్రదేశ్‌లోని ఆశావహ విద్యార్థులకు ప్రేరణగా పరిగణించబడుతుంది. భారతీయ ప్రతిభకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న గుర్తింపును హైలైట్ చేస్తుంది. అనంతపురంతో సంబంధాలున్న ప్రముఖ టెక్ నాయకుడు ప్రపంచ వేదికపై విజయం సాధించడం ఇదే మొదటిసారి కాదు. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల కూడా ఈ జిల్లాలోనే మూలాలు కలిగి ఉన్నారు.

Exit mobile version