NTV Telugu Site icon

ఒడిశా సీఎంకు ధన్యవాదాలు తెలిపిన ఏపీ సీఎం..

ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌కు సోషల్‌ మీడియా వేదికగా ధన్యవాదాలు తెలిపారు ఏపీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి… సాదరంగా ఆహ్వానించి, సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిపినందుకు సంతోషంగా ఉంది.. త్వరలో ఈ చర్చలు సత్ఫలితాలను ఇస్తాయని విశ్వసిస్తున్నానును అంటూ ట్వీట్‌ చేశారు వైఎస్‌ జగన్.. కాగా, ఇవాళ ఒడిశా సచివాలయంలో ఆ రాష్ట్ర సీఎం నవీన్‌ పట్నాయక్‌తో సీఎం వైఎస్‌ జగన్‌ సమావేశమైన సంగతి తెలిసిందే.. ఈ భేటీలో మూడు అంశాలపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య చర్చలు జరిగాయి.. రెండు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారానికి జాయింట్‌ కమిటీ వేయాలని నిర్ణయించిన సంగతి విదితమే.

Read Also: హరీష్‌రావు చేతికి ఆరోగ్యశాఖ..

మరోవైపు.. నవీన్‌ పట్నాయక్‌తో సమావేశం అనంతరం.. ఈ భేటీపై సంతోషాన్ని వ్యక్తం చేశారు సీఎం వైఎస్‌ జగన్.. సుదీర్ఘకాలంగా రెండు రాష్ట్రాల మధ్య పరిష్కృతం కాని అంశాలు ఉన్నాయి.. తొలిసారి ఈ అంశాలను పరిష్కరించడానికి అడుగు ముందుకేవామని.. ఇరు రాష్ట్రాల చీఫ్‌ సెక్రటరీలతో కమిటీ ఏర్పాటు కావడం సంతోషకరం అన్నారు. చీఫ్‌సెక్రటరీలతో ఏర్పాటయ్యే కమిటీ సమస్యల మూలాల్లోకి వెళ్తుందని.. వాటికి పరిష్కార మార్గాలను కనుగొంటుందని పేర్కొన్నారు. చర్చలు జరపడమే కాదు, జాయింట్‌ కమిటీ ఏర్పాటుకు ముందుకు వచ్చినందుకు ఒడిశా రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ గారికి, ఒడిశా ప్రభుత్వానికి, ఆ రాష్ట్ర అధికారులకు ధన్యవాదాలు తెలిపారు.. కలికట్టుగా, సహకార ధోరణితో వీటిని పరిష్కరించుకుంటాం.. రెండు రాష్ట్రాల ప్రజల విశాల ప్రయోజనాలే ధ్యేయంగా తెలిపారు ఏపీ సీఎం వైఎస్‌ జగన్.