Site icon NTV Telugu

JC Prabhakar Reddy: కేతిరెడ్డిపై జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

Jc Prabhakar Reddy

Jc Prabhakar Reddy

JC Prabhakar Reddy: మరోసారి అనంతపురం జిల్లా తాడిపత్రిలో పొలిటికల్‌ హీట్‌ పెరిగింది.. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డిపై మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మా భూమిలో అడుగుపెడితే ఊరంతా తిప్పుతూ చెప్పుతో కొట్టానంటూ గతంలో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు జేసీ ప్రభాకర్‌రెడ్డి..

Read Also: Mayor Suresh Babu: కడప మేయర్‌కు షాక్‌.. అనర్హత వేటు వేసిన ప్రభుత్వం..

అయితే, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి గతంలో అధికారం అడ్డం పెట్టుకుని ప్రభుత్వ భూములు కబ్జా చేశారని, సోలార్ ప్లాంట్ కి రైతులు ఇచ్చిన భూములను బలవంతంగా లాక్కున్నా చరిత్ర ఉందని ఆరోపించారు తాడిపత్రి మున్సిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి.. గతంలో పెద్దారెడ్డి భూమిలో అడుగు పెడితే నన్ను ఊరంతా తిప్పుతూ చెప్పుతో కొడతా అన్నాడని, ఇప్పుడు నీ భూమిలో నా వాళ్లు అడుగు పెట్టి నీ భూమి ఫెన్సింగ్ పీకారు, నీ చేతనైతే వచ్చి నన్ను చెప్పుతో కొట్టమని సవాలు విసిరారు. దేవుని సొమ్ము తిన్నావని, ఆలయాల భూములను అక్రమించుకున్నావని కేతిరెడ్డి పెద్దారెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు జేసీ.. ఈ రోజుతో నువ్వు తాడిపత్రి వదిలి సంవత్సరం అయిందని ప్రజలు పండగ చేసుకున్నారని పేర్కొన్నారు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి.

Exit mobile version