Manda Krishna Madiga: ఎస్సీ వర్గీకరణ మా ధ్యేయం.. అమలు చేయాలని సీఎం చంద్రబాబుని కోరుతున్నాం అన్నారు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ.. అనంతపురంలో జరిగిపన ఏపీ ఎమ్మార్పీఎస్ ఎంఎస్సీ అనుబంధ సంఘాల కార్యవర్గ సమావేశం జరిగింది.. ఈ కార్యవర్గ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ.. పలువురు రాష్ట్ర నేతలు పాల్గొనగా.. ఉమ్మడి జిల్లా నలమూలల నుంచి దళితులు, ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాల నేతలు తరలివచ్చారు.. ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ తమ ముందున్న ధ్యేయం.. ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుని కోరుతున్నాం అన్నారు.. చంద్రబాబు కష్ట సమయాల్లో ఉన్నప్పుడు ఎమ్మార్పీఎస్ అండగా నిలిచింది .. గత ఎన్నికల్లో కూటమి గెలుపు కోసం యావత్ దళితలు అహర్నిశలు కష్టపడ్డారు.. ఇదే విషయం ఎన్నో సభల్లో స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారని తెలిపారు.. ఇక, వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూటమి నేతలను ఇబ్బంది పెట్టినా ధైర్యంగా యావత్ మాదిగ జాతి అండగా నిలిచిందని గుర్తు చేశారు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ..
Read Also: Telangana: మహిళా శిశు సంక్షేమ శాఖలో కొలువుల జాతర..