Deepika: అనంతపురం జిల్లాలో మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు తన మాట నిలబెట్టుకున్నారు. అంధ మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు ఇంటి స్థలం కేటాయించారు.. దానికి సంబంధించిన పత్రాలను దీపికకు అందజేశారు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు.. అమరాపురం మండలం తంభాలహట్టి గ్రామంలో ఉన్న దీపిక ఇంటిని స్వయంగా సందర్శించారు. ఆమె పరిస్థితిని తెలుసుకుని వెంటనే ఇంటి స్థలం కేటాయించే చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, తన సొంత నిధులతో ఆరు నెలల్లో ఇల్లు నిర్మించి ఇస్తానని హామీ ఇచ్చారు. ప్రతిభ ఉన్న క్రీడాకారులను ప్రోత్సహించడం ప్రభుత్వంతో పాటు ప్రజా ప్రతినిధుల బాధ్యత అని తెలిపారు.
Read Also: JC Prabhakar Reddy Emotional: కన్నీరు పెట్టుకున్న జేసీ ప్రభాకర్ రెడ్డి..
అంధ మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్‌గా దేశానికి గౌరవం తీసుకొచ్చిన దీపికకు సహాయం చేయడం గర్వంగా ఉందని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు పేర్కొన్నారు. ఆమె వంటి ప్రతిభావంతులైన క్రీడాకారులకు అవసరమైన సహాయం అందించడానికి తాను ఎప్పుడూ ముందుంటానని చెప్పారు. ఈ సందర్భంగా గ్రామస్థులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఇచ్చిన హామీతో దీపిక కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు..
