NTV Telugu Site icon

అనంతపురం జిల్లా వార్తలు.. రౌండప్

బాలయ్య పుట్టిన రోజు వేడుకలు
నేడు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకొని హిందూపురంలోని ఆయన నివాసం వద్ద తెదేపా నాయకులు, అభిమానులు జన్మదిన వేడుకలు నిర్వహించనున్నారు.

వాహనం దగ్ధం
అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం ఓబులేసు కోన మలుపు వద్ద సిమెంట్ లోడుతో వెళ్తున్న ట్యాంకర్ లో మంటలు చెలరేగాయి. దీంతో ఆ వాహనం పూర్తిగా దగ్ధమైంది.

పాస్ పోర్టు సేవలు పునఃప్రారంభం
అనంతపురం జిల్లాలో ఈనెల 11 నుంచి ప్రధాన తపాలా కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాస్ పోర్టు సేవా కేంద్రం సేవలు పునఃప్రారంభం కానున్నాయి.

డిపాజిటర్లను మోసగించిన కేసు సీఐడీకి బదిలీ
అనంతపురం జిల్లా ధర్మవరంలో అధిక వడ్డీ చెల్లిస్తామంటూ ఈబిడ్ కంపెనీ పేరుతో డిపాజిటర్లను మోసగించిన కేసు సీఐడీకి బదిలీ అయింది. జిల్లా పోలీసులు కేసును సీఐడీకి బదిలీ చేస్తూ పంపిన ప్రతిపాదనలను ఆమోదించి డీఐజీ ఉత్తర్వులు జారీ చేశారు.