Site icon NTV Telugu

JC Prabhakar Reddy: కూటమి ప్రభుత్వంపై జేసీ ప్రభాకర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Jc

Jc

JC Prabhakar Reddy: తాడి­పత్రి మున్సిపల్‌ చైర్మన్, టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాడి­పత్రిలో తాజాగా, ఆయన మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తాను ప్రతిరోజూ.. తాడిపత్రిలో పర్యటిస్తున్నా.. కానీ, ప్రభుత్వ పథకాలు రావడం లేదని ప్రజలు మమ్మల్ని తిడుతున్నారని కామెంట్స్ చేశారు. గత ప్రభుత్వంలో అమ్మఒడితో పాటు పలు పథకాల కింద జగన్ ప్రజల అకౌంట్లలో నేరుగా డబ్బులు జమచేసేవారు, ఇప్పుడు అలా డబ్బులు అందకపోవడంతో తమను ప్రజలు తిడుతున్నారు అని చెప్పుకొచ్చారు. ఇక, రోడ్లు, నీళ్లు, సిలిండర్లు వాళ్లకు అవసరం లేదు.. నేరుగా డబ్బులు వచ్చి వాళ్ల జేబులో పడాలి అని అన్నారు. సంక్షేమ పథకాలు రాకపోతే.. వచ్చే ఎన్నికల్లో గెల­వడం కష్టంగానే ఉంటుందన్నారు.

Exit mobile version