Site icon NTV Telugu

JC Prabhakar Reddy: బీజేపీ నేతలపై జేసీ సంచలన వ్యాఖ్యలు.. హిజ్రాల కంటే హీనంగా..!

Jc

Jc

JC Prabhakar Reddy: బీజేపీ నేతలపై జేసీ ప్రభాకర్‌రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతలు హిజ్రాల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. న్యూఇయర్ సందర్భంగా తాడిపత్రిలో మహిళల కోసం ప్రత్యేక ఈవెంట్ నిర్వహిస్తే మీకేంటి సమస్యా? అని ప్రశ్నించారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌, వీహెచ్‌పీ తనపై లేనిపోని ఆరోపణలు చేశాయన్న జేసీ ప్రభాకర్‌రెడ్డి.. అనంతపురంలో తన బస్సుల దహనం వెనుక బీజేపీ నేతల ప్రమేయం ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు.

Read Also: China New Virus: చైనాలో కొత్త వైరస్.. కరోనా లాంటి లక్షణాలతో వేగంగా వ్యాప్తి..

తాడిపత్రిలో కేవలం మహిళల కోసం ప్రత్యేకంగా డిసెంబర్ 31 రాత్రి నేను నిర్వహించిన కార్యక్రమాలపై విమర్శలు చేసిన ఆర్ఎస్ఎస్, బీజేపీ, వీహెచ్‌పీ నాయకులపై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి విరుచుకుపడ్డారు. ఈ కార్యక్రమం పై విమర్శలు చేసిన ఆర్ఎస్ఎస్, బీజేపీ నాయకులు థర్డ్ జెండర్ కంటే ఇంకా తగ్గు నాకొడుకులంటూ జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక అనంతపురంలో తన బస్సులు పథకం ప్రకారం దగ్ధం చేసినా పోలీసులు షార్ట్ సర్క్యూట్ అంటూ కేసు నమోదు చేయడంపై జేసీ పోలీసుల తీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసులకు చేతకాదు కాబట్టే నేను ఫిర్యాదు చేయలేదు, మీకు చేతనైతే సుమోటోగా కేసు నమోదు చేసి నా బస్సులు పథకం ప్రకారం నిప్పంటించిన వారిపై చర్యలు తీసుకోవాలి. పోలీసులపై నాకు నమ్మకం లేదు, మీకు నిందితులు ఎవరో పట్టుకునేకి చేతకాదు కాబట్టే షార్ట్ సర్క్యూట్ అంటూ కేసు నమోదు చేశారు. వైసీపీ ప్రభుత్వంలో 450 కోట్లు డబ్బులు పోగొట్టుకున్నానని, ఇప్పుడు రెండు బస్సులు అంటిస్తే ఏమి అవుతుందని వ్యాఖ్యానించారు.. వీరి కంటే వైఎస్ జగన్ చాలా మేలని, జగన్ తన ప్రభుత్వంలో కేవలం బస్సులు మాత్రమే నిలబెట్టాడని , మీ బీజేపీ ప్రభుత్వంలో నా బస్సులు తగలబెట్టిచారని సంచలన ఆరోపణలు చేశారు జేసీ ప్రభాకర్‌ రెడ్డి..

Exit mobile version