Site icon NTV Telugu

Kethireddy Pedda Reddy: ఎట్టకేలకు తాడిపత్రిలో అడుగుపెట్టిన కేతిరెడ్డి పెద్దారెడ్డి.. 15 నెలల తర్వాత సొంత ఇంటికి..!

Kethireddy Pedda Reddy

Kethireddy Pedda Reddy

Kethireddy Pedda Reddy: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ఎట్టకేలకు తాడిపత్రిలో అడుగుపెట్టాడు.. జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్‌ కేతిరెడ్డి పెద్దారెడ్డి పాలిటిక్స్‌ ఓవైపు.. పోలీసుల ఆంక్షలు మరోవైపు.. ఇలా కేతిరెడ్డి.. తాడిపత్రిలో అడుగుపెట్టడానికి అడ్డంకిగా మారాయి.. అయితే, దీనిపై న్యాయపోరాటానికి దిగిన కేతిరెడ్డి.. హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించారు.. చివరకు సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈ రోజు తాడిపత్రి పట్టణంలోని తన సొంత ఇంటికి చేరుకున్నారు కేతిరెడ్డి పెద్దారెడ్డి.. ఈ పరిణామంతో సుమారు 15 నెలల తరువాత కేతిరెడ్డి తన సొంత ఇంటికి చేరుకున్నట్టు అయ్యింది.. గత ఎన్నికల సమయంలో జరిగిన ఘర్షణల కారణంగా పట్టణానికి దూరంగా ఉంటూ వస్తున్నారు పెద్దారెడ్డి.. ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో భారీ బందోబస్తు నడుమ తాడిపత్రి పట్టణంలోకి ఎంట్రీ ఇచ్చారు..

Read Also: Balapur Ganesh Laddu Auction: అందరి చూపు బాలాపూర్‌ గణేష్‌ లడ్డూపైనే.. ఎందుకంత ఫేమస్‌.. ఏంటా కథ..?

తాడిపత్రిలో అడుగుపెట్టడంపై సంతోషం వ్యక్తం చేశారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి.. 15 మాసాల తర్వాత తాడిపత్రి రావడం ఆనందంగా ఉందన్నారు.. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పోలీసులు భద్రత కల్పించారని తెలిపారు.. పోలీసుల కు అన్ని విధాలా సహకరిస్తాను అన్నారు.. తాడిపత్రి ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తా అన్నారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి.. కాగా, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తాడిపత్రి పట్టణానికి కేతిరెడ్డి వెళ్లడానికి అన్ని ఏర్పాట్లు చేశారు పోలీసులు. ఐదు వాహనాలు , 40 మంది అనుచరులతో తాడిపత్రికి చేరుకున్నారు.. తిమ్మంపల్లి లోని గుడిలో పూజలు చేసిన అనంతరం తాడిపత్రి పట్టణానికి వెళ్లారు..

Exit mobile version