Kethireddy Pedda Reddy: అనంతపురం జిల్లా తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ కేతిరెడ్డి పెద్దారెడ్డి పాలిటిక్స్ సాగుతూనే ఉంది.. తాడిపత్రిలో మళ్లీ అదే సీన్ రిపీట్ అవు తోంది. తాడిపత్రి వెళ్లేందుకు అనుమతి కావాలని.. దాని కోసం పోలీస్ భద్రత కల్పించాలంటూ జిల్లా ఎస్పీ జగదీష్ ను కోరారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి.. తాను తాడిపత్రి వెళ్లేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చిందని.. ఆ సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం భద్రత కల్పించాలని కోరినట్లు సమాచారం. అయితే, ఈ నెల 5వ తేదీ తర్వాత డేట్ ఫిక్స్ చేసుకోవాలని కేతిరెడ్డి పెద్దారెడ్డికి జిల్లా ఎస్పీ జగదీష్ రిప్లై ఇచ్చాడు.. అలాగే, పోలీసు భద్రతకు అయ్యే ఖర్చు వివరాలు ఇస్తాం.. డిపాజిట్ చేయాలని కూడా కేతిరెడ్డికి పోలీసులు సూచించినట్లు సమాచారం. దీనికి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అంగీకరించట్లు తెలుస్తోంది.
Read Also: ENG vs SA: వరల్డ్ నెం.1 బౌలర్ దెబ్బకి కుప్పకూలిన ఇంగ్లాండ్.. 49 పరుగులకే 8 వికెట్స్!
మరోవైపు ఇవాళ జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు తాడిపత్రిలోని మార్కెట్ యార్డ్ లో షాప్ లో ఓపెనింగ్ కార్యక్రమం పెట్టుకోవడంతో పెద్ద ఎత్తున జేసీ అనుచరులు ఈ కార్యక్రమానికి తరలివచ్చారు. మరి, ఈ నెల 5వ తేదీ తర్వాత పెద్దారెడ్డి ఏ రోజున తాడిపత్రి రానున్నారు అనేది ఉత్కంఠగా మారుతోంది.. ఇక, కేతిరెడ్డి పెద్దారెడ్డి అధికారంలో ఉన్న సమయంలో ఎన్నో అరచకాలు చేశారు.. ఇప్పుడు ఆయన బాధితులే పెద్దారెడ్డి.. తాడిపత్రి రాకుండా అడ్డుకుంటారని జేసీ ప్రభాకర్ రెడ్డి గతంలో వ్యాఖ్యానించిన విషయం విదితమే..
