Bus Accident: హైదరాబాద్ – బెంగళూరు హైవేపై కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం 19 మంది సజీవ దహనానికి కారణమైంది.. ఈ ఘటన మరువక ముందే బెంగళూరు హైవేపై మరో భారీ ప్రమాదం జరిగింది.. అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండల పరిధిలోని మిడుతూరు గ్రామం సమీపంలో అర్ధరాత్రి సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదం ఒక్కసారిగా కలకలం సృష్టించింది.. హైదరాబాద్ నుంచి బెంగళూరు వైపు ప్రయాణిస్తున్న ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, రోడ్డుపై నిలబడి ఉన్న క్రేన్‌ను తీసుకెళ్తున్న లారీని ఢీకొంది. డ్రైవర్ గమనించకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
Read Also: Viral Video: కుమార్తె పెళ్లిలో తండ్రి వినూత్న యత్నం.. చదివింపుల కోసం జేబుకి పేటీఎం క్యూఆర్ కోడ్..
అయితే, ఈ ఘటనలో పెద్ద ప్రమాదం తప్పినట్టు అయ్యింది.. బస్సులో పలువురు ప్రయాణీకులు ప్రయాణిస్తుండగా, అదృష్టవశాత్తూ ఎవరికీ గాయాలు కాలేదు. ప్రయాణికులందరూ క్షేమంగా ఉండటంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన రాత్రి సమయంలో చోటు చేసుకోవడంతో స్థానికులు మరియు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఈ ప్రమాదంతో బెంగళూరు హైవేపై కొద్ది సేపు ట్రాఫిక్ నిలిచిపోగా.. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. బస్సును, లారీని అక్కడి నుంచి తొలగించి ట్రాఫిక్‌ను నియంత్రించారు.. ఇక, డ్రైవర్ నిర్లక్ష్యంపై కేసు నమోదు చేసే అవకాశాలు పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది.. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాకపోవడం అంతా ఊపిరి పీల్చుకున్నారు.. రోడ్డుపై నిలిపిన వాహనాలపై హెచ్చరిక లైట్లు లేకపోవడం ప్రమాదాలకు కారణమవుతున్నాయని పోలీసులు చెబుతున్నారు.
