Site icon NTV Telugu

Daggubati Prasad: వైసీపీ నేతలకు మైండ్‌ బ్లాక్‌ అయ్యింది.. గాలి తరహాలో జగన్‌ కూడా..!

Daggubati Prasad

Daggubati Prasad

Daggubati Prasad: గాలి జనార్దన్ రెడ్డి తరహాలో లిక్కర్ స్కామ్ లో జగన్ అండ్ కో కూడా జైలుకు వెళ్లక తప్పదని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. అనంతపురం నగరంలో ఇవాళ ఆయన పలు కాలనీల్లో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి మాట్లాడుతూ కడపలో మహానాడు అత్యంత ఘనంగా జరిగిందని 7 నుంచి 8లక్షల మంది జనం పాల్గొన్నారన్నారు. ఇది చూసిన వైసీపీ నాయకులకు మైండ్ బ్లాక్ అయిందన్నారు. అందుకే వారు ఏం చేయాలో తెలియక వెన్నుపోటు దినోత్సవం అంటూ హడావిడి చేస్తున్నారన్నారు. జూన్ 4వ తేదీన తాము విధ్వంసం నుంచి అభివృద్ధి వైపు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

Read Also: Sajjala Ramakrishna Reddy: చంద్రబాబు స్టార్ట్ చేశారు.. దాని పర్యవసానం భయంకరంగా ఉంటుంది..!

మైనింగ్ కేసుల్లో గాలి జనార్దన్ రెడ్డి, రాజగోపాల్, ఐఏఎస్ శ్రీలక్ష్మి వంటి వారు జైలుకు వెళ్లారని గుర్తు చేశారు. ఇప్పుడు లిక్కర్ స్కాంలో కూడా ధనుంజయ రెడ్డి, గోవిందప్పతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు చివరకు జగన్ కూడా జైలుకు వెళ్లక తప్పదన్నారు. 2 రోజుల క్రితం సచివాలయం ఉద్యోగిని స్థానిక టిడిపి నాయకుడు ఫోన్లో దూషించిన సంఘటన మీద ఖచ్చితంగా చర్యలు ఉంటాయన్నారు. ఉద్యోగుల మీద ఎవరైనా దురుసుగా వ్యవహరిస్తే ఉపేక్షించేది ఉండదన్నారు. ఏ పార్టీ అయినా చర్యలు ఉంటాయన్నారు. ఈ విషయంలో చట్టం తన పని తాను చేసుకెళ్తుందని ఎమ్మెల్యే దగ్గుపాటి అన్నారు.

Read Also: Bandi Sanjay: కాంగ్రెస్ వంద రోజులలో అరు గ్యారంటీలని అటకెక్కించింది..

Exit mobile version