NTV Telugu Site icon

మూడు ర‌కాల రోగాల‌కు మందు త‌యారీ-ఆనంద‌య్య‌

Anandayya

క‌రోనా సెకండ్ వేవ్ క‌ల్లోలం సృష్టిస్తున్న స‌మ‌యంలో.. కృష్ణపట్నం పేరు మారుమ్రోగుతోంది. కరోనాకు ఉచితంగా మందుపంపిణీ చేస్తుండ‌డంతో.. ఇప్పుడు వేలాది మంది అటు ప‌రుగులు తీస్తున్నారు. ఆనంద్ ఆయుర్వేదంపై ఉన్న పట్టుతో అతను మందును కనిపెట్టారు.. కరోనాకు మందు ఇస్తున్నారన్న విషయంతో జనం తండోపతండాలుగా అక్కడికి వస్తున్నారు. ఇక‌, తాను త‌యారు చేస్తున్న మందుల‌పై క్లారిటీ ఇచ్చారు ఆనంద‌య్య.. ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయ‌న‌.. ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉండే వ‌స్తువుల‌తో మందు త‌యారు చేస్తున్న‌ట్టు తెలిపారు. ఇప్పుడు మూడు ర‌కాల రోగానికి మందు త‌యారు చేస్తున్నామ‌న్న ఆయ‌న‌.. క‌రోనా రానివారికి, క‌రోనా వచ్చిన వారికి, ఆక్సిజ‌న్ లెవ‌ల్స్ త‌గ్గిన వారికి ఇలా మూడు ర‌కాల మందులు త‌యారు చేస్తున్నామ‌ని వెల్ల‌డించారు. ఈ మందు శాశ్వ‌తంగా ప‌నిచేస్తుంద‌ని… త్వ‌ర‌గా రిక‌వ‌రీ అయ్యే అవ‌కాశం కూడా ఉంద‌ని తెలిపారు ఆనంద‌య్య‌.