Site icon NTV Telugu

20 వేలకు బ్లాక్ మార్కెట్లో ఆనందయ్య మందు..

కృష్ణపట్నం ఆయుర్వేదిక్ మందు నిలిపివేసినా.. బ్లాక్ లో మాత్రం దందా కొనసాగుతోంది. హైదరాబాద్ కు చెందిన రవి బంధువుల కోసం ఐడ్రాప్స్ రూ. 20,000కు భేరం అడినట్లు సమాచారం. ఉచితంగా ఇచ్చే దానికి రూ. 20,000 ఎందుకు అని రవి స్నేహితుడు సాయి ప్రశ్నించగా.. డబ్బులు లాక్కుని కృష్ణ పట్నం నాగరాజు పరారయ్యాడు. దీంతో పోలీసులకు సాయి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. ఈ మందు హానికరం కాదని నివేదిక రావడంతో మరింత డిమాండ్ పెరగడంతో కృష్ణపట్నంలోకి ఎవరిని అనుమతించడం లేదు పోలీసులు. అటు ఫోన్ ద్వారా కృష్ణపట్నం గ్రామస్తులు బేరసారాలు ఆడుతున్నారు. అంతే కాదు రహస్యంగా ఇళ్లలో ఆనందయ్య మందు తయారు చేసి బ్లాక్ చేసుకుంటున్నారు కృష్ణపట్నం గ్రామస్తులు.

Exit mobile version